నేపాల్ మార్కెట్లో విడుదల కానున్న మహీంద్రా క్వాంటో

By Ravi

చూస్తుంటే నేపాల్ మార్కెట్లో మేడ్ ఇన్ ఇండియా కార్లకు గిరాకీ నానాటికీ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పొరుగుదేశమైన నేపాల్ ఆటోమొబైల్స్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కార్ కంపెనీలు తమ ఉత్పత్తులతో అక్కడి మార్కెట్లో క్యూ కట్టి వెళ్తున్నాయి. ఇప్పటికే అనేక ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాలను నేపాల్ మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే.

టాటా నానో, హోండా అమేజ్, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వాహనాలను ఇప్పటికే నేపాల్ మార్కెట్లో విడుదలైన సంగతి తెలిసినదే. తాజాగా మహీంద్రా అండ్ మహీంద్రా కూడా తమ కాంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా క్వాంటోను నేపాల్ మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం జులై నెలలోనే మహీంద్రా క్వాంటో నేపాల్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Mahindra Quanto

నేపాల్‌‌లో మహీంద్రా వాహనాలను విక్రయించేందుకు అధీకృత డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్న అగ్ని ఇన్‌కార్పోరేటెడ్ మహీంద్రా క్వాంటోను నేపాల్ మార్కెట్‌కు దిగుమతి చేసుకొని, అక్కడి మార్కెట్లో విక్రయించనుంది. భారత్‌లో క్వాంటో అమ్మకాలు ఆశించిన రీతిలో సాగపోతుండటంతో కంపెనీ ఈ మోడల్‌ను ఎగుమతి చేసే అంశంపై దృష్టి సారించింది.

ఎక్స్‌పోర్ట్ వెర్షన్ క్వాంటోకు, ఇండియన్ వెర్షన్ క్వాంటోకు ఎలాంటి వ్యత్యాసాలు లేవు. నేపాల్ మార్కెట్లో మహీంద్రా క్వాంటో కేవలం సి4, సి8 వేరియంట్లో మాత్రమే లభ్యమయ్యే ఆస్కారం ఉంది. ఇందులో అదే 1.5 లీటర్, 3-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 2+3+2 సీటింగ్ ఆప్షన్ (7-సీటర్)తో అందుబాటులో ఉండనుంది. మరి ఇది నేపాల్ మార్కెట్లో అయినా సక్సెస్‌ను సాధిస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, July 12, 2013, 9:26 [IST]
English summary
Mahindra and Mahindra is all set to launch its compact SUV Quanto in Nepal. Mahindra cars authorized and sole distributor Agni Incorporated will sell this Mahindra Quanto in Nepal market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+