మహీంద్రా నుంచి స్పెషల్ ఎడిషన్ స్కార్పియో ఎస్‌యూవీ
స్కార్పియో ప్రియుల కోసం బ్రేకింగ్ న్యూస్..! ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ విపణిలో అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ మోడల్ 'మహీంద్రా స్కార్పియో'లో త్వరలోనే ఓ స్పెషల్ ఎడిషన్ మార్కెట్లోకి రానుంది. ఈ మేరకు రూపొందించిన ఓ టీజర్ ఫొటోను కంపెనీ తమ అధీకృత ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్‌లో 'స్కార్పియో స్పెషల్ ఎడిషన్'
'కమింగ్ సూన్' అనే క్యాప్షన్‌తో విడుదల చేసింది.
టీజర్‌ను బట్టి చూస్తే, స్పెషల్ ఎడిషన్ మహీంద్రా స్కార్పియో సరికొత్త బాడీ గ్రాఫిక్స్‌తో మరిన్ని అదనపు ఫీచర్లతో లభ్యం కానున్నట్లు తెలుస్తోంది. రానున్న పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని మహీంద్రా అండ్ మహీంద్రా ఈ కొత్త స్కార్పియోను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అంటే, మరికొద్ది రోజుల్లోనే ఇది మార్కెట్లో విడుదల అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మహీంద్రా స్కార్పియో స్పెషల్ ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే, ఇంకొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. ఇదిలా ఉండగా, 2016 వరకు ఎలాంటి సరికొత్త ఉత్పత్తులను విడుదల చేసే యోచనలో లేమని మహీంద్రా అండ్ మహీంద్రా పేర్కొంది. ఈ కంపెనీ అధ్యక్షుడు పవన్ గోయెంకా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాము విడుదల చేయాలనుకున్న సరికొత్త ఉత్పత్తులనన్నీ గడచిన రెండేళ్లలో విడుదల చేసేశామని, ఇక కొత్త ఉత్పత్తులను 2016లో మాత్రమే విడుదల చేస్తామని తెలిపారు.



Click it and Unblock the Notifications








