నేపాల్‌కు మహీంద్రా వాహనాలను కానుకగా ఇవ్వనున్న భారత్

By Ravi

నేపాల్‌లోని ప్రతి ఒక్కరికీ నవంబర్ 19, 2013వ తేది అతి ముఖ్యమైన రోజు, ఎందుకంటే ఆ రోజున కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి కాబట్టి. ఈ ఎన్నికలకు మద్దతుగా మన భారత ప్రభుత్వం నేపాల్ సర్కారుకు 630 మహీంద్రా వాహనాలను కానుకగా ఇవ్వనుంది.

మొత్తం 630 మహీంద్రా స్కార్పియో, బొలెరో వాహనాలను నేపాల్ ఎలక్షన్ కమిషన్, హోం మంత్రిత్వ శాఖకు అందజేయనున్నారు. నేపాల్‌లో ఈ వాహనాలను సెక్యూరిటీ బలగాలు, పోలీస్ బలగాలు, సాయుధ పోలీస్ బలగాలు తమ కాన్వాయ్‌లో భాగంగా ఉపయోగించనున్నాయి.

Mahindra Vehicles To Be Gifted By Government To Nepal

ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఇంటర్నేషనల్ ఆపరేషన్స్, ఆటో, ఫామ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్స్) రుజ్బెహ్ ఇరానీ మాట్లాడుతూ.. భారత్-నేపాల్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేలా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం, అందులోను తమ వాహనాలను కానుకగా ఇవ్వాలనుకోవటం తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు.

తమకు ఇదెంతో గర్వించ దగిన విషయమని ఆయన చెప్పారు. ఈ వాహనాలను నేపాల్‌లోని మహీంద్రా అధీకృత దిగుమతిదారు అయిన అగ్ని ఇన్‌కార్పోరేటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేపాల్ సర్కారుకు అందించనున్నారు. అగ్ని ఇన్‌కార్పోరేటెడ్ 1991వ సంవత్సరం నుంచి నేపాల్‌లో మహీంద్రా వాహనాలను విక్రయిస్తుంది. ఈ సంస్థకు నేపాల్‌లో 22 డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, November 16, 2013, 15:08 [IST]
English summary
November 19, 2013 will be an extremely important day for everyone in Nepal as the Constitutional Assembly elections are to be held in the country. As a gesture of support and token of goodwill Government of India has taken the decision to gift 630 Mahindra vehicles to Nepal. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+