మహీంద్రా ఎక్స్‌యూవీ500కు 10 లక్షల మంది అభిమానులు
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ గ్లోబల్ ఎస్‌యూవీ 'మహీంద్రా ఎక్స్‌యూవీ500' అప్పుడే పది లక్షల మంది అభిమానులను సొంతం చేసుకుంది. ప్రపంచ స్థాయి డిజైన్, సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన ఫీచర్స్‌తో రూపుదిద్దుకున్న ఈ ఎస్‌యూవీ, ఆరంభం నుంచే అభిమానులను ఆకట్టుకుంటోంది. నిజం చెప్పాలంటే, మహీంద్రా నుంచి ఇంత స్టయిలిష్ లుక్ కలిగిన స్పోర్టీ ఎస్‌యూవీ గతంలో ఎన్నడూ రాలేదు.
మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్‌లో ఇప్పుడు ఈ కారును ఇష్టపడే వారి సంఖ్య 10 లక్షలను దాటిపోయింది. ఈ సందర్భంగా కంపెనీ తమ అభిమానుల కోసం ఫేస్‌బుక్‌లో ఓ ప్రత్యేక కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ పట్ల తమ అభిప్రాయాన్ని తెలిపిన వారికి కంపెనీ కాఫీ టేబుల్ బుక్‌లను ఆఫర్ చేస్తోంది.

సెప్టెంబర్ 2011లో మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఎస్‌యూవీ భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ఇటీవలే ఈ మోడల్‌ను దక్షిణాఫ్రికా, నేపాల్ వంటి దేశాలకు ఎగుమతి చేయటాన్ని కూడా ప్రారంభించింది. శక్తివంతమైన ఇంజన్, సాటిలేని పెర్ఫామెన్స్, సౌకర్యవంతమైన ఇంటీరియర్స్, విలాసవంతమైన ఫీచర్లు అన్నింటికన్నా మించి ఆకర్షనీయమైన ధరతో ఇది కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ500 మొత్తం మూడు వేరియంట్లలో (డబ్ల్యూ6 ఫ్రంట్ వీల్ డ్రైవ్, డబ్ల్యూ8 ఫ్రంట్ వీల్ డ్రైవ్, డబ్ల్యూ8 ఆల్ వీల్ డ్రైవ్) లభ్యమవుతోంది. ఇందులో ఉపయోగించిన పవర్‌ఫుల్ 2.2 లీటర్ ఎమ్‌హాక్ ఇంజన్ ఇది గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని, 330 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది కేవలం 5.4 సెకండ్లలోనే 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది ప్రతి లీటరుకు 15 కి.మీ. మైలేజ్‌ను ఇస్తుంది.


Click it and Unblock the Notifications








