లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకెక్కిన మహీంద్రా ఎక్స్‌యూవీ500
కారులో ఎవరైనా భారతదేశంలోని ఈ చివరి ఆ చివరి వరకు 62 గంటల్లో వెళ్లగలరా..? అసాధ్యం అంటారా..! కానీ సాధ్యమైంది. దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా బృందం తమ పాపులర్ ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీలో కేవలం 62 గంటల 20 నిమిషాల వ్యవధిలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నిరంతరాయంగా మొత్తం 3997 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సరికొత్త రికార్డును సృష్టించారు.
అంతేకాదు, ఇదే అంశంపై గతంలో ఉన్న రికార్డును మహీంద్రా బద్దలు కొట్టింది. గతం రికార్డు ప్రకారం ఇదే దూరాన్ని 72 గంటల 47 నిమిషాల్లో చేరుకున్నట్లు ఉంది. కాగా మహీంద్రా బృందం తమ ఎక్స్‌యూవీ500 ఈ రికార్డును ఇదివరకటి రికార్డు సమయం కన్నా 10 గంటల 27 నిమిషాల ముందుగానే చేరుకుంది.
మహీంద్రా ఈ రికార్డు కోసం భారతీయ రోడ్లకు అనుగుణంగా, అన్ని వాతావరణాలకు సరిపోయే విధంగా ఉండే తమ చిరుత లాంటి 'ఎక్స్‌యూవీ500'ను ఎంచుకుంది. దాదాపు ఈ 4 వేల కిలోమీటర్ల ప్రయాణంలో మహీంద్రా బృందం ఎక్కడా కూడా బ్రేక్ తీసుకోకుండా నిరంతరాయంగా రాత్రింబవలు ప్రయాణించి ఈ రికార్డును సృష్టించింది. ఆద్యంతం అడ్వెంచరస్‌గా సాగిన ఈ రికార్డును మనం కూడా క్రింది వీడియోలో వీక్షిద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/1xfUktOaiPQ?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications









