మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఇప్పుడు నేపాల్ మార్కెట్లో లభ్యం
యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా భారత మార్కెట్లో అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ గ్లోబల్ ఎస్‌యూవీ 'మహీంద్రా ఎక్స్‌యూవీ500' ఇప్పుడు నేపాల్ మార్కెట్లో కూడా లభ్యం కానుంది. నేపాల్‌లో మహీంద్రా ఉత్పత్తులకు అధీకృత డిస్ట్రిబ్యూటర్ అయిన అగ్ని ఇన్‌కార్పోరేటెడ్ ఈ ఎస్‌యూవీని భారత్‌ను దిగుమతి చేసుకొని అక్కడి మార్కెట్లో విక్రయించనుంది. భారతదేశపు రూపాయి విలువతో పోల్చుకుంటే నేపాల్ రూపీ విలువ చాలా తక్కువ కాబట్టి అక్కడి మార్కెట్లో ఎక్స్‌యూవీ500 ధర భారీగా ఉంది.
నేపాల్ మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ6 ఫ్రంట్ వీల్ డ్రైవ్, డబ్ల్యూ8 ఫ్రంట్ వీల్ డ్రైవ్, డబ్ల్యూ8 ఆల్ వీల్ డ్రైవ్ అనే మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. ఇందులో శక్తివంతమైన పవర్‌ఫుల్ 2.2 లీటర్ ఎమ్‌హాక్ 140 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని, 330 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది కేవలం 5.4 సెకండ్లలోనే 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది ప్రతి లీటరుకు 15 కి.మీ. మైలేజ్‌ను ఇస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీలో ఎల్‌ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, టచ్-ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్, హిల్-డీసెంట్ కంట్రోల్, ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్, ఈఎస్‌పి మరియు బ్లోవర్ కంట్రోల్స్ వంటి అత్యాధునిక సాంకేతిక, భద్రతా ఫీచర్లు ఉన్నాయి. రెండు వెర్షన్లలో (టూ-వీల్ డ్రైవ్, ఫోర్-వీల్ డ్రైవ్) లభించే మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది ఆర్కిటిక్ బ్లూ కలర్, వొల్కానో బ్లాక్, శాటిన్ వైట్, మూన్‌డస్ట్ సిల్వర్, టస్కన్ రెడ్, ఓప్యులెంట్ పర్పల్, డాల్ఫిన్ గ్రే కలర్ ఆప్షన్లతో లభిస్తుంది.
నేపాల్ మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ500 ధరలు ఇలా ఉన్నాయి.
- మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ 6 (ఫ్రంట్-వీల్ డ్రైవ్) - రూ.33.06 లక్షలు
- మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ 8 (ఫ్రంట్-వీల్ డ్రైవ్) - రూ.36.52 లక్షలు
- మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ 8 (ఆల్-వీల్ డ్రైవ్) - రూ.38.37 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఖాట్మండు)


Click it and Unblock the Notifications








