ఎక్స్‌యూవీ500 ఇప్పుడు ఆర్కిటిక్ బ్లూ కలర్‌లో లభ్యం

By Ravi

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) దేశీయ విపణిలో అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'మహీంద్రా ఎక్స్‌యూవీ500' ఇప్పుడు మరొక ఆకర్షణీయమైన రంగులో లభ్యం కానుంది. ఎక్స్‌యూవీ500లో 'ఆర్కిటిక్ బ్లూ' అనే కొత్త కలర్‌ను కంపెనీ పరిచయం చేసింది. తాజా కలర్ చేరికతో మహీంద్రా ఎక్స్‌యూవీ500 కలర్ ఆప్షన్ల సంఖ్య ఏడుకు పెరిగింది. ఎక్స్‌యూవీ500 కొత్త ఆర్కిటిక్ బ్లూ కలర్‌తో పాటుగా, వొల్కానో బ్లాక్, శాటిన్ వైట్, మూన్‌డస్ట్ సిల్వర్, టస్కన్ రెడ్, ఓప్యులెంట్ పర్పల్, డాల్ఫిన్ గ్రే కలర్ ఆప్షన్లతో లభ్యమవుతుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 మూడు వేరియంట్లలో (డబ్ల్యూ6 ఫ్రంట్ వీల్ డ్రైవ్, డబ్ల్యూ8 ఫ్రంట్ వీల్ డ్రైవ్, డబ్ల్యూ8 ఆల్ వీల్ డ్రైవ్) లభిస్తోంది. ప్రస్తుతం దేశీయ విపణిలో దీని ధరలు రూ.11.8 లక్షల నుంచి రూ.14.4 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ కారులో పవర్‌ఫుల్ 2.2 లీటర్ ఎమ్‌హాక్ 140 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని, 330 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభిస్తుంది.

ఈ ఇంజన్‌లో ఉపయోగించిన 5వ తరం (ఫిఫ్త్ జనరేషన్) వేరియబల్ టర్బోఛార్జర్ ద్వారా ఇది కేవలం 5.4 సెకండ్లలోనే 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది ప్రతి లీటరుకు 15 కి.మీ. (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) మైలేజ్‌ను ఇస్తుంది. ఎమ్ అండ్ ఎమ్ తమ ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని తొలిసారిగా సెప్టెంబర్ 2011లో కేవలం రూ.10.8 లక్షల ప్రారంభ ధరకే మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఇది హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది.

Mahindra XUV500

More from DriveSpark

Article Published On: Thursday, February 7, 2013, 11:39 [IST]
English summary
Mahindra, the Indian SUV specialist which is enjoying the success of its flagship XUV 500, has added a new colour to its premium SUV. The XUV 500 has now been launched with the new Arctic Blue colour. The Arctic Blue XUV 500 will join six other colour options already available.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+