మారుతి ఆల్టో 800 విఎక్స్ఐలో ఆప్షనల్ డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్
దేశపు అగ్రగామి ప్యాసిజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న చిన్న కారు ఆల్టో 800లో అందుబాటులో విఎక్స్ఐ వేరియంట్ ఇప్పుడు ఆప్షనల్ డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్‌తో లభ్యం కానుంది.
మారుతి సుజుకి గడచిన జూన్ నెలలో విఎక్స్ఐ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఎల్ఎక్స్ఐ వేరియంట్‌కు ఎగువన ప్రవేశపెట్టిన ఈ మారుతి ఆల్టో 800 విఎక్స్ఐ టాప్-ఎండ్ వేరియంట్లో సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, డోర్ సైడ్ మౌల్డింగ్స్, ఫుల్ వీల్ కవర్స్, ఆల్ పవర్ విండోస్, యూఎస్‌బి కనెక్టివిటీ మరియు నాలుగు స్పీకర్లతో కూడిన స్టీరియో ఆడియో సిస్టమ్, ఎడమవైపు సైడ్ మిర్రర్, రియర్ స్పాయిలర్ ఫీచర్లు లభ్యమవుతున్నాయి.

అయితే, ఈ వేరియంట్‌లో కంపెనీ డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేసేది. కాగా, ఇప్పుడు దీనిని ఆప్షనల్ ఫీచర్‌గా మార్చారు. విఎక్స్ఐ వేరియంట్‌లో ఈ ఆప్షనల్ డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ రూ.18,000 లకు అందుబాటులో ఉంది.

కొత్త ఆల్టో 800 కారులో ఉపయోగించిన రీడిజైన్డ్ 796సీసీ, 3-సిలిండర్, 12-వాల్వ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 47.5 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 69 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, పెట్రోల్ వెర్షన్ ఆల్టో 800 లీటరుకు 22.74 కి.మీ. మైలేజీని, సిఎన్‌జి వెర్షన్ ఆల్టో 800 కేజీకి 30.46 కి.మీ. మైలేజీని ఇస్తాయి.


Click it and Unblock the Notifications








