ఫ్లాష్‌బ్యాక్ 2012: దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు

By Ravi

దేశీయ మార్కెట్లోకి ఎన్ని కొత్త బ్రాండ్‍‌లు వచ్చినప్పటికీ మారుతి సుజుకి బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గటం లేదు. గడచిన సంవత్సరంలో (2012) భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయిన టాప్ 10 కార్లలో మొదటి 4 స్థానాలను మారుతి సుజుకి కార్లే ఆక్రమించుకున్నాయంటే, ఈ కార్లకు ఉన్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. సమ్మెలు, గొడవలు, ప్రతికూల మార్కెట్ పరిస్థితులు, పోటీవాతావరణం వీటన్నింటినీ సైతం సమర్థవంతంగా ఎదుర్కోవటంలో మారుతి సుజుకి మరొకరు సాటిరారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదేమో..!

2012లో కూడా చిన్న కార్లదే హవా. ఈ సమయంలో దేశంలో కెల్లా అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మూడు కొత్త కార్లు వచ్చి చేరాయి. అంతేకాకుండా, ఈ జాబితాలో ఇటీవలే మార్కెట్లో విడుదలైన రెండు కొత్త కార్లు కూడా స్థానం సంపాదించుకున్నాయి. అంతేకాదండోయ్.. మరొక దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ నుంచి లభిస్తున్న అత్యంత చవక కారు టాటా నానో కూడా ఈ జాబితాలో స్థానాన్ని సొంతం చేసుకుంది. మరి ఈ టాప్ 10 కార్లేంటో వాటి కథేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

మారుతి సుజుకి ఆల్టో

మారుతి సుజుకి ఆల్టో

ఆల్టో కారు మారుతి సుజుకి కంపెనీకు ఎప్పటి నుంచో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ కారుకు సరికొత్త హంగులను చేర్చి మార్కెట్లో అగ్గి రాజేసేందుకు కంపెనీ సరికొత్త ఆల్టో 800 కారును మార్కెట్లో ప్రవేశపెట్టడంతో ఈ అమ్మకాలు మరింత పుంజుకున్నాయి. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి ఆల్టో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి స్విఫ్ట్

ఈ టాప్ 10 కార్ల జాబితాలో రెండవ స్థానాన్ని మారుతి సుజుకి స్విఫ్ట్ కైవసం చేసుకుంది. 2011 సంవత్సరంతో పోల్చుకుంటే స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలు ఏకంగా 51.83 శాతం వృద్ధిని కనబరచాయి. మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో చెలరేగిన అల్లర్ల కారణంగా ప్లాంటు కొద్ది రోజులు మూతపడి, స్విఫ్ట్ ఉత్పత్తి నిలిచిపోయినప్పటికీ, కొనుగోలుదారులు ఈ కారు కోసం నెలల తరబడి వేచి ఉండటానికి సిద్ధపడ్డారు కానీ, వేరే మోడల్‌ వైపుకు తమ దృష్టిని మరల్చుకోలేదు.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌కు ఎంతటి డిమాండ్ ఉందో, మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ సెడాన్‌కు కూడా దాదాపుగా అంతే డిమాండ్ ఉంది. 2011తో పోల్చుకుంటే, 2012లో స్విఫ్ట్ డిజైర్ అమ్మకాలు ఏకంగా 56.31 శాతం వృద్ధిని కనబరచి ఈ జాబితాలో 3వ స్థానాన్ని కైవసం చేసుకునేలా చేసింది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్

మారుతి సుజుకి వ్యాగన్ఆర్

ఈ జాబితాలో 4వ స్థానాన్ని కూడా మారుతి సుజుకి బ్రాండే ఆక్రమించుకుంది. 2012లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లలో వ్యాగన్ఆర్ 4వ స్థానాన్ని దక్కించుకుంది. వాస్తవానికి వ్యాగన్ఆర్ 2వ స్థానంలో ఉండాల్సి ఉంది. అయితే, గడచిన సంవత్సరంలో పెట్రోల్ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో ఈ మోడల్ అమ్మకాలు స్వల్పంగా క్షీణించాయి. అయినప్పటికీ, ఇది భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఒకటిగా నిలిచింది.

హ్యుందాయ్ ఐ10

హ్యుందాయ్ ఐ10

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లలో 5వ స్థానాన్ని హ్యుందాయ్ సొంతం చేసుకుంది. 3వ స్థానంలో ఉండాల్సిన ఈ మోడల్ రెండు స్థానాలు దిగజారి 5వ స్థానానికి పరిమితం అయింది. ఇందుకు ప్రధాన కారణం 2012లో పెట్రోల్ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టడమే. అంతకు ముందు సంవత్సరంతో పోల్చుకుంటే, 2012లో ఐ10 అమ్మకాలు 29.85 శాతం తగ్గాయి.

టాటా ఇండికా

టాటా ఇండికా

ఈ జాబితాలో టాటా మోటార్స్ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ టాటా ఇండియా 6వ స్థానంలోకి వచ్చి చేరింది. అంతకు ముందు సంవత్సరంలో ఇది 5వ స్థానంలో ఉంది.

హ్యుందాయ్ ఇయాన్

హ్యుందాయ్ ఇయాన్

దేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా, భారత మార్కెట్లో అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఇయాన్ అమ్మకాలు కంపెనీ ఆశించిన రీతిలో సాగలేదు. అయినప్పటికీ, ఇది ఈ టాప్ 10 కార్ల జాబితాలో 7వ స్థానంలో నిలిచింది.

హ్యుందాయ్ ఐ20

హ్యుందాయ్ ఐ20

హ్యుందాయ్ అందిస్తున్న ఐ10 తర్వాత కొనుగోలుదారులు ఎక్కువగా కొనుగోలు చేసిన కారు హ్యుందాయ్ ఐ20. డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభించే హ్యుందాయ్ ఐ20లో కంపెనీ ఓ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత ఈ మోడల్ అమ్మకాలు జోరందుకున్నాయి. 2011తో పోల్చుకుంటే 2012లో ఐ20 అమ్మకాలు 20 శాతం మేర వృద్ధి చెంది, ఈ జాబిలో 8వ స్థానాన్ని సొంతం చేసుకుంది.

టాటా నానో

టాటా నానో

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న ప్రజల కారు టాటా నానోకు మెల్లిగా ప్రజాదరణ పెరుగుతోంది. తక్కువ ధరకే ఎక్కువ మైలేజీనిచ్చే పెట్రోల్ కారు లభిస్తుండటంతో కొనుగోలుదారు ఈ మోడల్‌పై ఆసక్తి కనబరచారు. 2011తో పోల్చుకుంటే, 2012లో టాటా నానో అమ్మకాలు 17.73 శాతం వృద్ధి చెంది 74,545 యూనిట్లుగా నమోదయ్యాయి. టాప్ 10 కార్ల జాబితాలో ఈ చిన్న కారు 9వ స్థానంలో నిలిచింది.

ఫోర్డ్ ఫిగో

ఫోర్డ్ ఫిగో

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లలో 10వ స్థానంలో నిలిచిన కారు ఫోర్డ్ ఫిగో. 2012లో ఫోర్డ్ ఫిగో అమ్మకాలు 8.65 శాతం తగ్గినప్పటికీ ఇది తన స్థానాన్ని మాత్రం పదిలంగానే ఉంచుకుంది. ఫోర్డ్ ఇండియా ఇటీవలే తమ బుజ్జికారు ఫిగోలో ఓ రిఫ్రెష్డ్ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 1, 2013, 18:13 [IST]
English summary
The 2012 top 10 of best selling cars in India features three new entrants to the list which includes two new cars. As expected small cars continued their dominance of the Indian car market. The top 10 is also heavily populated by cars from Maruti Suzuki. No wonder it is India's leading carmaker.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+