గ్రామీణ మార్కెట్లపై కన్నేసిన మారుతి సుజుకి ఇండియా

By Ravi

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి, దేశీయ విపణిలో తన అగ్రస్థానాన్ని ఇలాగే పదికాలాల పాటు పదిలంగా ఉంచుకునేందుకు సరికొత్త సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగానే, మారుతి సుజుకి ఇండియా ఇప్పుడు గ్రామీణ మార్కెట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి దాదాపు లక్షకు పైగా గ్రామాల్లోకి అడుగుపెట్టాలని నిర్ణయించామని కమపెనీ చైర్మన్ ఆర్‌.సి భార్గవ తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ కాలానికి అన్ని కంపెనీల వాహనాల అమ్మకాలు దాదాపు 4-5 శాతం క్షీణించాయని, అయితే మొత్తం అమ్మకాల్లో 30 శాతంగా ఉండే గ్రామీణ ప్రాంత విక్రయాలు మాత్రం 18 శాతం వృద్ధి చెందాయని ఆయన వివరించారు. కానీ ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ 5-6 శాతం తగ్గిందని, ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొన్న గ్రామీణ ప్రాంతాల్లో అవకాశాలు ఎక్కవగా ఉన్న నేపథ్యంలో, అమ్మకాలు పెంచుకునేందుకు ఈ మార్కెట్లపై దృష్టి సారిస్తున్నామని భార్గవ చెప్పారు.

Maruti Suzuki

గ్రామీణ మార్కెట్లలో విస్తరణ ప్రణాళికలను ఐదేళ్ల క్రితమే రూపొందించుకున్నామని, ఈ ప్రణాళికలో భాగంగా గడచిన ఏడాది కాలంలో 44,000 గ్రామాలకు చేరువయ్యామని, ఇది ఈ ఏడాది నవంబర్ నాటికి 60,000 గ్రామాలకు పెరిగిందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా 6.51 లక్షల గ్రామాలుండగా వచ్చే ఏడాది మార్చి నాటికి ఒక లక్షకు పైగా గ్రామాలకు మారుతిని చేర్చాలని లక్ష్యంతో ఉన్నామని ఆర్.సి భార్గవ వెల్లడించారు. ప్రస్తుతం మారుతి సుజుకి దేశవ్యాప్తంగా 700 గ్రామీణ అవుట్‌లెట్‌లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, December 26, 2013, 9:37 [IST]
English summary
As the going gets tougher in the Indian auto industry, Maruti Suzuki India is driving into the rural markets to boost sales. The company, which devised aplan to tap rural markets five years ago, is planning to have presence in a total of one lakh villages across the country by March next year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+