లీటరుకు 33 కి.మీ. మైలేజీనిచ్చే మారుతి ఏ-స్టార్ ఈకో!
ఇంధన ధరలు భగ్గుమంటున్న నేటి రోజుల్లో లీటరుకు 33 కి.మీ. మైలేజీనిచ్చే కారు అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది? త్వరలోనే ఈ కలను నిజయం చేయబోతోంది. భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ). మారుతి సుజుకి ప్రస్తుతం దేశీయ విపణిలో అందిస్తున్న గ్లోబల్ మోడల్ పెట్రోల్ హ్యాచ్‌బ్యాక్ 'ఏ-స్టార్'లో ఎక్కువ మైలేజీనిచ్చే వేరియంట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.
పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, లీటరు ఇంధనానికి 33 కి.మీ. మైలేజీనిచ్చేలా ఓ నెక్స్ట్ జనరేషన్ ఏ-స్టార్ కారును మారుతి సుజుకి అభివృద్ధి చేస్తోంది. ఈ కారును 'ఏ-స్టార్ ఈకో' అని పిలువనున్నారు. ఈ ఏడాదే ఇది మార్కెట్లోకి రావచ్చని అంచనా. మెరుగైన మైలేజ్ కోసం ఏ-స్టార్ ఈకో కారు బరువును తేలికగా ఉంచనున్నారు. ప్రస్తుత ఏ-స్టార్ బరువుతో పోల్చుకుంటే ఏ-స్టార్ ఈకో బరువు సుమారు 20 కేజీల వరకూ తక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది.

త్వరలో మార్కెట్‌ను తాకనున్న ఈ నెక్స్ట్ జనరేషన్ ఏ-స్టార్ కారును, పర్యావరణ సాన్నిహిత్యం (ఈకో ఫ్రెండ్లీ)గా ఉండేలా తీర్చిదిద్దనున్నారు. ఈ కారులో అధిక మైలేజీనిచ్చే చిన్న డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. దీనిని ఏ+ సెగ్మెంట్లో కంపెనీ అందించే అవకాశం ఉంది. అయితే, ధర మాత్రం ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నా ఏ-స్టార్ కన్నా స్వల్పంగా అధికంగా ఉండనుంది (రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా).


Click it and Unblock the Notifications








