స్విఫ్ట్, డిజైర్, రిట్జ్ మరియు ఎర్టిగా మోడళ్లపై 100 లీటర్ల డీజిల్ ఫ్రీ

By Ravi

గడచిన కొద్ది నెలలుగా భారత మార్కెట్లో కార్ల అమ్మకాలు మందకొడిగా సాగుతున్న సంగతి తెలిసినదే. తగ్గుముఖం పడుతున్న కార్ల అమ్మకాలను పెంచుకునేందుకు పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తులపై వివిధ ప్రోత్సాహకాలను ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ ఉత్పత్తులపై కూడా వివిధ ఆఫర్లను అందిస్తోంది.

మారుతి సుజుకి అందిస్తున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, స్విఫ్ట్ డిజైర్ సెడాన్, రిట్జ్ హ్యాచ్‌బ్యాక్ మరియు ఎర్టిగా ఎమ్‌పివి డీజిల్ వెర్షన్ల కొనుగోలుపై కస్టమర్లకు కంపెనీ అద్దిరిపోయే ఆఫర్లను అందిస్తుంది. ఈ డీజిల్ మోడళ్లను కొనుగోలు చేసే కస్టమర్లు ఇప్పుడు 100 లీటర్ల డీజిల్‌ను ఉచితంగా పొందవచ్చు. వీటిల్లో ఏ మోడల్‌నైనా బుక్ చేసుకునే వారికి 100 లీటర్ల ఉచిత డీజిల్‌తో పాటుగా రూ.20,000 ఎక్సేంజ్ బోనస్‌‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమేనని కంపెనీ ఓ వాణిజ్య ప్రకటనలో పేర్కొంది.

ఈ నాలుగు డీజిల్ మోడళ్లలో ఒకే ఇంజన్‌ను ఉపయోగించారు. వీటిల్లో 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌ను అమర్చారు. స్విఫ్ట్, డిజైర్ మరియు రిట్జ్ మోడళ్లలో ఇది గరిష్టంగా 75 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తిని చేస్తుంది. అయితే ఎర్టిగా ఎమ్‌పివిలో మాత్రం ఈ ఇంజన్‌ను గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసేలా రీట్యూన్ చేశారు. మరి ఆలస్యమెందుకు.. వెంటనే అధీకృత మారుతి సుజుకి డీలర్‌ను సంప్రదించి మీ డ్రీమ్ డీజిల్ కారును సొంతం చేసుకోండి.

Maruti Offers 100 Liters Free Diesel On Swift, Dzire, Ritz And Ertiga

More from DriveSpark

Article Published On: Tuesday, May 21, 2013, 12:54 [IST]
English summary
The slowdown in the Indian automotive Industry has brought the market leader, Maruti Suzuki offering discounts on its diesel range of best selling cars including Swift, Dzire, Ritz and even Ertiga.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+