మారుతి సుజుకి నుంచి స్పెషల్ ఎడిషన్ స్విఫ్ట్ డిజైర్ రీగల్‌

By Ravi

హోండా కార్స్ ఇండియా తాజాగా ప్రవేశపెట్టిన మొట్టమొదటి డీజిల్ కారు 'అమేజ్' సెడాన్ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునేందుకు గాను, ఈ సెగ్మెంట్లో లీడర్‌గా ఉన్న 'స్విఫ్ట్ డిజైర్'లో ఓ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను మారుతి సుజుకి విడుదల చేసింది. దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అందిస్తున్న స్విఫ్ట్ డిజైర్‌కు మరిన్ని అదనపు ఫీచర్లను జోడించి 'స్విఫ్ట్ డిజైర్ రీగల్' (Swift Dzire Regal) పేరుతో కంపెనీ అందిస్తోంది.

ఈ స్విఫ్ట్ డిజైర్ రీగల్ స్పెషల్ ఎడిషన్‌ ఇంటీరియర్, ఎక్స్టీరియర్లలో అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. అయితే, ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఈ స్పెషల్ ఎడిషన్ కేవలం విఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. ఇది కొత్త సెరెన్ బ్లూ పెయింట్ షేడ్‌లో కొత్త బాడీ గ్రాఫిక్స్‌తో లభ్యమవుతుంది. అప్పర్ అండ్ లోవర్ గ్రిల్‌పై సిల్వర్ ఫినిష్ ట్రీట్‌మెంట్, ఫాగ్ ల్యాంప్స్ అండ్ వింగ్ మిర్రర్స్, పార్కింగ్ సెన్సార్స్, బాడీ కలర్డ్ మడ్ ఫ్లాప్స్ వంటి ఎక్స్టీరియర్ మార్పులను ఇందులో గమనించవచ్చు.

ఇంకా, ఆటో వాల్యూమ్ కంట్రోల్ మరియు ట్వీటర్లతో కూడిన ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్, ఆర్మ్‌రెస్ట్‌ లపై వుడ్ వర్క్, స్టెయిన్‌లెస్ స్టీల్ డోర్ సిల్స్, బీజ్ ఫాక్స్ లెథర్ కుషన్స్, ఎంబ్రాయిడర్డ్ సీట్ కవర్స్, లెథర్‌తో కప్పబడిన స్టీరింగ్ వీల్ కవర్, బీజ్ ఫ్లోర్ మ్యాట్స్ మరియు కార్ పెర్ఫ్యూమ్‌లను ఇంటీరియర్లలో జోడించారు. ఈ స్పెషల్ ఎడిషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ రీగల్ ధర రూ.5.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.

Swift Dzire Regal

More from DriveSpark

Article Published On: Monday, April 15, 2013, 16:36 [IST]
English summary
To celebrate the fifth anniversary of Swift Dzire, Maruti Suzuki India has launched the limited edition Dzire Regal with updates to the interiors and exteriors. The new trim will only be available on the VXi petrol. The Dzire Regal is on sale with a price tag of Rs 5.95 lakh (ex-showroom, Mumbai).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+