మెగా కార్నివాల్‌ను ప్రారంభించిన మారుతి సుజుకి
దేశపు అగ్రామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) జూన్ 2013 నెలను 'ఎక్సేంజ్ నెల'గా ప్రకటించింది. ఈనెలలో ఎమ్ఎస్ఐకు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద కానీ, తమ సెకండ్‌హ్యాండ్ కార్ల విభాగమైన ట్రూ వేల్యూ అవుట్‌లెట్లలో గానీ వినియోగదారులు కార్లను ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ క్యాంపైన్ ద్వారా 5 లక్షలకు పైగా వినియోగదారులకు చేరువ కావాలని మారుతి సుజుకి భావిస్తోంది.
ఈ ప్రణాళికలో భాగంగా, దేశవ్యాప్తంగా 112 నగరాల్లో ఈ నెల 15, 16 తేదీల్లో మెగా కార్నివాల్‌ను నిర్వహిస్తున్నామని పేర్కొంది. ఈ మెగా కార్నివాల్‌లో స్పాట్ బుకింగ్ ప్రయోజనాలు, ఆకర్షణీయమైన నెలవారీ వాయిదాలు (ఈఎమ్ఐ), ఎక్స్ఛేంజ్, లాయల్టీ బోనస్ ఆఫర్లను అందిస్తున్నామని మారుతి సుజుకి తెలిపింది.
నెల పొడవునా సాగే ఈ మెగా కార్నివాల్, ఉత్తమమైన ధరకే వినియోగదారులకు తమ పాత కార్లను మార్చుకొని కొత్త కార్లను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తుందని మారుతి సుజుకి ఇండియా ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) మయాంక్ పారీక్ అన్నారు. ఈ మెగా కార్నివాల్ తమ ట్రూ వ్యాల్యూ చైన్ ఆధ్వర్యంలో సాగుతుందని, ఈ తరహా వ్యాపారంలో మారుతి సుజుకి మార్కెట్ లీడర్‌గా ఉందని, ఈ ప్రణాళిక వలన మార్కెట్ సెంటిమెంట్ మారే అవకాశం ఉందని ఆయన అన్నారు.



Click it and Unblock the Notifications








