బీట్ ది హీట్: ఉచితంగా ఏసి చెక్ చేస్తున్న మారుతి

ఈ ఉచిత సర్వీస్ క్యాంప్ మే 25, 26 తేదీలలో జరుగుతుంది. ఈ సర్వీస్ క్యాంప్‌కు తీసుకువచ్చే మారుతి సుజుకి కార్లలో కంపెనీ ఉచితంగా ఎయిర్ కండిషనర్‌ను చెక్ చేసి లోపాలు ఏవైనా ఉంటే సరిచేస్తుంది. అంతేకాకుండా, ఉచిత టాప్ కార్ వాష్‌ను కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఈ బీట్ ది హీట్ ఉచిత సర్వీస్ చెకప్ క్యాంప్‌లలో శిక్షణ పొందిన మారుతి సుజుకి సర్వీస్ బృందాలు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌ను ఉచితంగా తనిఖీ చేసి గరిష్ట పెర్ఫామెన్స్, కంఫర్ట్ లెవల్స్‌ను చేరుకునేందుకు సలహాలు ఇస్తారు.
ఈ క్యాంపైన్‌ను ప్రకటించిన సందర్భంగా మారుతి సుజుకి ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) మయాంక్ పారీక్ మాట్లాడుతూ.. ఈసారి వేసవి తీవ్రత ఎక్కువగా ఉందని, కస్టమర్లు తమ కార్లలోని ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేయాలని కోరుకుంటారని, అలాంటి వారి కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. ఈ బీట్ ది హీట్ క్యాంప్‌లో ఉచిత చెకప్‌తో పాటుగా కొత్త వాహనాల టెస్ట్ డ్రైవ్, అదనపు వారంటీ మరియు జెన్యూన్ యాక్ససరీస్‌లను కంపెనీ ఆఫర్ చేస్తుంది.


Click it and Unblock the Notifications








