పేరుకుపోతున్న ఉత్పత్తి, మారుతి ప్లాంట్లు బంద్!

ఈ నేపథ్యంలో, ఇన్వెంటరీలో సమతౌల్యతను నిర్వహించేందుకు గాను తమ ప్లాంట్లను మూసి వేస్తున్నట్లు మారుతి సుజుకి పేర్కొంది. సాలీనా 15 లక్షల కార్లను తయారు చేసే సామర్థ్యం కలిగిన మారుతి సుజుకి తమ ప్లాంట్లలో జూన్ 7, 8వ తేదీలలో రెండు రోజుల పాటు మూసివేయనుంది. అలాగే, ఈనెలలో 17-22వ తేది వరకు వేసవి సీజన్ కోసం బై-యాన్యువల్ ప్లాంట్ క్లోజర్‌ను ప్రకటించింది. ఆల్టో, వ్యాగన్ఆర్ వంటి పెట్రోల్ కార్లకు డిమాండ్ తగ్గిపోవటంతో గడచిన మార్చ్ 9న కంపెనీ తమ గుర్గావ్ ప్లాంటును మూసివేసింది.
కాగా, ఈ ఏడాదిలో మారుతి సుజుకి తమ ప్లాంటును మూసివేయటం ఇది రెండవసారి. గడచిన మే నెలలో మారుతి సుజుకి అమ్మకాలు 14 శాతం క్షీణించి 84,677 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో దేశీయ అమ్మకాలు 13 శాతం క్షీణించి 77,821 యూనిట్లుగా నమోదుగా కాగా, ఎగుమతులు 27 శాతం క్షీణించి 6,856 యూనిట్లుగా నమోదయ్యాయి.


Click it and Unblock the Notifications








