స్విఫ్ట్‌పై డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్న మారుతి సుజుకి డీలర్లు
మారుతి సుజుకి నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న స్విఫ్ట్ కారుపై డిస్కౌంట్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? కొత్త స్విఫ్ట్ మార్కెట్లో విడుదలై దాదాపు రెండేళ్లు కావస్తున్న కంపెనీ ఈ మోడల్‌పై ఇప్పటి వరకూ డిస్కౌంట్‌ను అందించలేదు. గడచిన 2005 సంవత్సరంలో భారత విపణిలోకి ప్రవేశించిన మారుతి సుజుకి స్విఫ్ట్ కంపెనీకు ఆల్టో తర్వాత బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది. గతంలో ఈ మోడల్‌కు ఉత్పత్తికి మించిన డిమాండ్ ఉండేది.
అప్పట్లో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను సొంతం చేసుకునేందుకు కొనుగోలుదారులు నెలల తరబడి వేచి ఉండేవారు. అయితే, ప్రస్తుతం మార్కెట్ మందగమనం కారణంగా మారుతి సుజుకితో పాటు దాదాపు అన్ని కార్ల కంపెనీలు అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో వివిధ కార్ కంపెనీలు తమ అమ్మకాలను పెంచుకునేందుకు డిస్కౌంట్లను ఆఫర్ చేయక తప్పడం లేదు. ఇదే కోవలో మారుతి సుజుకి ఇండియా డీలర్లు కూడా స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌పై డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నారు.
మారుతి సుజుకి స్విఫ్ట్‌పై రూ.5,000 నుంచి రూ.10,000 వరకూ కార్పోరేట్ డిస్కౌంట్, తక్షణ డెలివరీ అంటూ డీలర్లు కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే, కొన్ని నగరాల్లో మారుతి సుజుకి డీలర్లు స్విఫ్ట్ డిజైర్ సెడాన్, రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌లపై కూడా డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నారు. వాస్తవానికి సరసమైన ధరకే కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇంత కన్నా అనువైన సమయం మరొకటి లేదు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే డీలరు వద్దకు వెళ్లి బేరమాడండి.. మంచి లాభం పొందండి..!



Click it and Unblock the Notifications








