మారుతికి కలిసొచ్చిన రూపాయ్, పెరిగిన క్యూ1 లాభం

By Ravi

డాలరుతో పోల్చుకుంటే రూపాయి మారకపు విలువ రోజురోజుకీ తగ్గిపోతున్న తరుణంలో వివిధ అంతర్జాతీయ కార్ కంపెనీలు నష్టపోతుంటే, దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మాత్రం లాభపడుతోంది. రూపాయి క్షీణత మారుతి సుజుకి సంస్థకు కలిసొచ్చింది. ఫలితంగా జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి ఈ కంపెనీ మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.

ఈ త్రైమాసికంలో మారుతి సుజుకి నికర లాభం 49 శాతం వృద్ధి చెంది రూ.631.6 కోట్లకు పెరిగింది. గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన నికర లాభం రూ.423.77 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రోత్సాహకర ఫలితాలను సాధించడానికి ప్రధానంగా విదేశీ మారకపు లాభాలు దోహదపడ్డాయని కంపెనీ సీఎఫ్‌వో అజయ్ సేథ్ చెప్పారు.

అయితే ఎంత మేర దోహదపడ్డాయనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. కాగా, కాలానికి గాను కంపెనీ ఆదాయం మాత్రం 5 శాంతగ్గి రూ.9,995 కోట్లకు పరిమితమైంది. మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటంతో తొలి త్రైమాసికంలో వాహన అమ్మకాలు కూడా 10 శాతం క్షీణించి 2,66,343 యూనిట్లకు మాత్రమే పరిమితం అయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 2,95,896 యూనిట్లుగా నమోదయ్యాయి.

Maruti Suzuki Alto 800

More from DriveSpark

Article Published On: Friday, July 26, 2013, 16:34 [IST]
English summary
Driven by foreign exchange gain, the country's largest car-maker Maruti Suzuki India (MSI) today reported 49 per cent jump in net profit at Rs 631.6 crore for the first quarter ended June 30, 2013. The company had posted net profit of Rs 423.77 crore in the April-June quarter of last fiscal.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+