ఎల్‌సివి, చిన్న కార్ల కోసం మారుతి కాంపాక్ట్ డీజిల్ ఇంజన్

By Ravi

చిన్న కారు విభాగంలో ఆధిపత్యాన్ని కలిగి ఉన్న దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) తమ తొలి కాంపాక్ట్ డీజిల్ ఇంజన్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ 800సీసీ, 2-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను కంపెనీ తొలిసారిగా ఓ లైట్ కమర్షియల్ వెహికల్ (నెక్స్ట్ జెనరేషన్ సుజుకి క్యారీ ఎల్‌సివి, కోడ్ నేమ్ వై9టి)లో ఉపయోగించనుంది.

మారుతి తయారు చేస్తున్న ఈ చిన్న డీజిల్ ఇంజన్, కంపెనీ చరిత్రలో ఓ కీలక ఘట్టంగా మారనుంది. వాణిజ్య వాహనాల నిర్వహణకు అత్యంత అవసరమైన బెస్ట్-ఇన్-క్లాస్ మైలేజ్, పెర్ఫామెన్స్, డ్యూరబిలిటీలతో మారుతి ఈ ఇంజన్‌ను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం భారత ఎల్‌సివి సెగ్మెంట్లో టాటా ఏస్, మహీంద్రా మాక్సిమో, పియాజ్జియో ఆపే, అశోక్ లేలాండ్ దోస్త్ మోడళ్ల హవా నడుస్తోంది. కాగా.. మారుతి నుంచి రానున్న ఈ కొత్త ఎల్‌సివి పై మోడళ్లకు ధీటుగా నిలువనుంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మారుతి తమ ఎల్‌సివిలో ఉపయోగించనున్న ఈ చిన్న డీజిల్ ఇంజన్‌ను రీడిజైన్ చేసి, కంపెనీ అందిస్తున్న చిన్న కార్లలో కూడా (ఆల్టో వంటి మోడళ్లలో) పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇదే గనుక జరిగితే, అత్యంత సరమైన ధరకే మారుతి డీజిల్ కారు లభ్యమయ్యే ఆస్కారం ఉంటుంది.

Maruti Suzuki LCV

More from DriveSpark

Article Published On: Thursday, October 10, 2013, 10:33 [IST]
English summary
India's largest passenger carmaker Maruti Suzuki is developing its first in-house diesel engine. The new compact two-cylinder, 800cc unit will debut in the next-generation Suzuki ‘Carry’ light commercial vehicle (code name: Y9T). Company has also plans to develop a redesigned version of this engine that will fitted in smaller passenger cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+