గుజరాత్ ప్లాంట్‌లో ఎల్‌సివిని ఉత్పత్తి చేయనున్న మారుతి

By Ravi

భారతదేశపు అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండయా ఇప్పుడు చిన్న తరహా వాణిజ్య వాహనాలపై దృష్టి సారించింది. గుజరాత్‌లోని ప్లాంటులో లైట్ కమర్షియల్ వెహికల్స్ (ఎల్‌సివి)ని ఉత్పత్తి చేయాలని భావిస్తున్నామని మారుతి సుజుకి ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

తాజా సమాచారం ప్రకారం, వై9టి (Y9T) అనే కోడ్‌నేమ్‌తో మారుతి సుజుకి ఓ కొత్త ఎల్‌సివిని అభివృద్ధి చేస్తుంది. ఇది ఈ సెగ్మెంట్లోని టాటా ఏస్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది. మారుతి సుజుకి నుంచి రానున్న ఈ ఎల్‌‍‌సివిలో 2-సిలిండర్, 800సీసీ డీజిల్ ఇంజన్‌‌ను ఉపయోగించనున్నారు. ప్రస్తుతం ఈ ఇంజన్అభివృద్ధి అడ్వాన్స్‌డ్ స్థాయిలో ఉన్నట్లు సమాచారం.

భారత్‌లోని మారుతి సుజుకి రీసెర్చ్ అండ్ డెవలప్‌‌మెంట్ కేంద్రంలో ఈ ఎల్‌సివిని అభివృద్ధి చేస్తున్నారు. కంపెనీ అభివృద్ధి చేస్తున్న 2-సిలిండర్, 800సీసీ స్టాండర్డ్ వేరియంట్‌ను ఎల్‌సివిలో ఉపయోగించనుండగా, ఇందులో ఓ టర్బోఛార్జ్‌డ్ వేరియంట్‌ను మారుతి సుజుకి అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న కార్లలో ఈ టర్బోఛార్జ్‌డ్ వెర్షన్‌ను ఉపయోగించవచ్చని అంచనా.

త్వరలో మారుతి సుజుకి ఓ కాంపాక్ట్ డీజిల్ కారును మార్కెట్లో విడుదల చేయనున్న నేపథ్యంలో, ఈ పోటీని తట్టుకునేందుకు మారుతి సుజుకి కూడా తాజాగా అభివృద్ధి చేస్తున్న చిన్న డీజిల్ ఇంజన్ భవిష్యత్తులో విడుదల చేయబోయే చిన్న కార్లలో ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు.

Maruti LCV

More from DriveSpark

Article Published On: Thursday, May 16, 2013, 16:13 [IST]
English summary
Maruti Suzuki India has cleared a proposal to start manufacturing light commercial vehicles (LCV). Senior Maruti Suzuki executives communicated this decision at an offsite with its vendors in Malaysia last week.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+