నవంబర్‌లో 10 శాతం తగ్గిన మారుతి సుజుకి అమ్మకాలు

By Ravi

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియాకు ఈ పండుగ సీజన్ ఆశించిన ఫలితాలను తెచ్చిపెట్టలేకపోయింది. గడచిన నవంబర్ నెలలోను కంపెనీ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. నవబర్ 2012తో పోల్చుకుంటే నవంబర్ 2013లో మారుతి సుజుకి ఇండియా అమ్మకాలు 10.7 శాతం క్షీణించి 1,03,200 యూనిట్ల నుంచి 92,140 యూనిట్లకు పడిపోయాయి.

ఇదే సమయంలో దేశీయ అమ్మకాలు 5.9 శాతం క్షీణించి 90,882 యూనిట్ల నుంచి 85,510 యూనిట్లకు పడిపోయాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. గడచిన నెలలో మినీ ప్యాసింజర్ కార్ల అమ్మకాలు (ఎమ్800, ఆల్టో, ఏ-స్టార్, వ్యాగన్ఆర్) మాత్రం 3.7 శాతం వృద్ధి చెంది 36,679 యూనిట్ల నుంచి 38,040 యూనిట్లకు పెరిగాయి.

Maruti Suzuki Stingray

ఇదే సమయంలో కాంపాక్ట్ కార్ల అమ్మకాలు (స్విఫ్ట్, ఎస్టిలో, రిట్జ్) 24 శాతం క్షీణించి 23,849 యూనిట్ల నుంచి 18,122 యూనిట్లకు పడిపోయాయి. అయితే, కాంపాస్ట్ సెడాన్ డిజైర్ అమ్మకాలు మాత్రం 13.2 శాతం వృద్ధి చెంది 13,502 యూనిట్ల నుంచి 15,286 యూనిట్లకు పెరిగాయని కంపెనీ పేర్కొంది.

ఇకపోతే కంపెనీ అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ ఎస్ఎక్స్4 కారు అమ్మకాలు 71.1 శాతం క్షీణించి 692 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు పడిపోయాయి. కంపెనీ అందిస్తున్న ప్రీమియం సెడాన్ కిజాషి ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోలేదు. యుటిలిటీ వాహనాల విషయానికి వస్తే (ఎర్టిగా, గ్రాండ్ విటారా, జిప్సీ) 21.5 శాతం తగ్గి 7,439 యూనిట్ల నుంచి 5,840 యూనిట్లకు పడిపోయాయి.

ఓమ్నీ, ఈకో వ్యాన్‌ల అమ్మకాలు 7.3 శాతం క్షీణించి 8,650 యూనిట్ల నుంచి 8,021 యూనిట్లకు పడిపోయాయి. ఇదే సమయంలో ఎగుమతులు కూడా 46.2 శాతం క్షీణించి 12,318 యూనిట్ల నుంచి 6,630 యూనిట్లకు పడిపోయాయి.

More from DriveSpark

Article Published On: Monday, December 2, 2013, 12:11 [IST]
English summary
The country's largest carmaker Maruti Suzuki India reported 10.7 per cent decline in its total sales at 92,140 units in November as against 1,03,200 units in the same month last year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+