మారుతి సుజుకి ఆల్టో కె10 మ్యూజిక్ ఎడిషన్ విడుదల
ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని, దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి అందిస్తున్న ఆల్టో కె10లో ఓ లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. 'ఆల్టో కె10 మ్యూజిక్' (Alto K10 MusiK) పేరుతో కంపెనీ విడుదల చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ కారులో, రెగ్యులర్ వెర్షన్‌తో పోల్చుకుంటే అనేక కొత్త ఫీచర్లు లభ్యం కానున్నాయి.
ఆల్టో కె10 మ్యూజిక్ లిమిటెడ్ ఎడిషన్ కారులో డిజైన్, ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఆల్టో కె10లో ఉపయోగించిన 1.0 లీటర్ కె-సిరీస్, 3-సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 68 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇంది లీటర్ పెట్రోలుకు 20.92 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది. కాగా.. రెగ్యులర్ వెర్షన్‌లో అందుబాటులో లేని కొత్త ఫీచర్లను ఈ కారులో అందిస్తున్నారు. సదరు ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

- జెవిసి ఎమ్‌పి3 ప్లేయల్ (యూఎస్‌బి కనెక్టివిటీతో)
- 4 ఇంచ్ ఫ్రంట్ స్పీకర్స్
- బాడీ గ్రాఫిక్స్
- స్టీరింగ్ కవర్స్
- ఆంబీంట్ లైటింగ్
- మడ్ ఫ్లాప్స్
- యూనివర్సల్ మ్యాట్స్
- ఆల్టో కె10 మ్యూజిక్ డెకాల్
- రియర్ స్పాయిలర్


Click it and Unblock the Notifications








