మారుతి సుజుకి ఎస్ఎక్స్4 సెడాన్‌లో అప్‌గ్రేడెడ్ వెర్షన్
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ 'ఎస్ఎక్స్4'లో ఓ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు గతంలో పలు కథనాల్లో తెలుగు డ్రైవ్ స్పార్క్ ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా.. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మారుతి సుజుకి ఎస్ఎక్స్4 సెడాన్‌ను వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం భారత మార్కెట్లో ఎస్ఎక్స్4 సెడాన్ అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఇందులో అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను విడుదల చేయటం ద్వారా ఈ మోడల్ అమ్మకాలను పెంచుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఇది మునుపటి వెర్షన్ ఎస్ఎక్స్4 సెడాన్ కన్నా మరింత మెరుగైన డిజైన్, ఆకర్షనీయమైన లుక్, విలాసవంతమైన ఫీచర్లతో రూపుదిద్దుకోనుంది.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఈ కొత్త మోడల్ ఎస్ఎక్స్4 సెడాన్‌ను ఇప్పటికే 'వైఎల్1' (YL1) అనే కోడ్ నేమ్‌తో మారుతి సుజుకి తమ మానేసర్ ప్లాంటులో అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. పాత మారుతి సుజుకి ఎస్ఎక్స్4 సెడాన్‌తో పోల్చుకుంటే కొత్త ఈ కొత్త ఎస్ఎక్స్4 సెడాన్‌లో కొత్త క్రోమ్-ఫినిష్ గ్రిల్, రీ-ప్రొఫైల్ చేయబడిన బంపర్స్, కొత్త హెడ్‌ల్యాంప్స్, సరికొత్త రియర్ డిజైన్ వంటి బాహ్య మార్పులు ఉండనున్నాయి.
అలాగే, ఇంటీరియర్లలో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. టాప్-ఎండ్ వేరియంట్‌లో నావిగేషన్ సిస్టమ్ స్టాండర్డ్ ఫీచర్‌గా లభించే అవకాశం ఉంది. చైనాలో అమ్ముడవుతున్న ఫేస్‌లిఫ్ట్ సుజుకి ఎస్ఎక్స్4 సెడాన్‌లో చేసిన మార్పుల చేర్పులనే ఇండియన్ వెర్షన్ ఎస్ఎక్స్4 సెడాన్‌లోను చేయనున్నట్లు సమాచారం. ఈ కొత్త ఎస్ఎక్స్4 సెడాన్‌కు సంబంధించిన రహస్య చిత్రాలు ఇప్పటికే ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.

అయితే, యాంత్రికపరంగా మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఇంజన్లనే కొత్త వాటిలోను ఉపయోగించనున్నారు.పెట్రోల్ వేరియంట్ ఎస్ఎక్స్4లో ఉపయోగించిన 1586సీసీ ఇంజన్ 104.7 పిఎస్‌ల శక్తిని, 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
అలాగే, డీజిల్ వేరియంట్ ఎస్ఎక్స్4లో ఉపయోగించిన 1248సీసీ ఇంజన్ 90 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. పెట్రోల్ వేరియంట్ ఎస్ఎక్స్4 సెడాన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (జెడ్ఎక్స్ఐ వేరియంట్)లతో లభిస్తుండగా డీజిల్ వేరియంట్ కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోనే లభ్యమవుతుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








