స్పెషల్ ఎడిషన్ మారుతి ఎస్టిలో ఎన్‌లైవ్ విడుదల
దేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న చిన్న కారు 'ఎస్టిలో' అమ్మకాలు ఆశించిన రీతిలో సాగకపోతుండటంతో, ఈ మోడల్ అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ ఇందులో ఓ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఎస్టిలో కారుకు కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ చేసి 'ఎస్టిలో ఎన్‌లైవ్' అనే పేరుతో (Estilo Nlive) ఓ లిమిటెడ్ ఎడిషన్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది.
మారుతి సుజుకి ఎస్టిలో ఎన్‌లైవ్ లిమిటెడ్ ఎడిషన్ కారులో లెథర్ సీట్ కవర్లు, యూఎస్‌బి ఆప్షన్‌తో కూడిన డ్యూయెల్-డిన్ సౌండ్ సిస్టమ్, డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్, బాడీ గ్రాఫిక్స్, ఫుల్ వీల్ కవర్స్, బీజ్ పార్సిల్ ట్రే వంటి స్పెషల్ ఫీచర్లు లభ్యం కానున్నాయి. అంతేకాకుండా, రు.23,000 విలువ కలిగిన ఫుల్ ఫీచర్ ప్యాకేజ్‌ను కేవలం రూ.15,000 లకే అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. 998సీసీ పెట్రోల్ ఇంజన్ కలిగిన ఎస్టిలో ఎన్‌లైవ్ లీటరుకు 19 కి.మీ. మైలేజీస్తుందని కంపెనీ పేర్కొంది.
ఈ స్పెషల్ ఎడిషన్ మారుతి ఎస్టిలో ఎన్‌లైవ్ 'బ్రీజ్ బ్లూ' అనే కొత్త కలర్‌లో కూడా లభ్యమవుతుంది. ఇటీవలి నెలల్లో విడుదల చేసిన వ్యాగన్ఆర్, ఏ-స్టార్, ఆల్టో స్పెషల్ ఎడిషన్లకు మంచి స్పందన లభించిందని, వీటి వలన కంపెనీ అమ్మకాలు కూడా జోరందుకున్నాయని, సరికొత్త ఫీచర్లను జోడించిన ఎస్టిలో ఎన్‌లైవ్ కారును కూడా కొనుగోలుదారులు ఆదరిస్తారని మారుతి సుజుకి ఇండియా వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) మనోహర్ భట్ తెలిపారు. ఏప్రిల్ 2012 నుంచి జనవరి 2013 కాలంలలో కేవలం 9600 ఎస్టిలో కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి.



Click it and Unblock the Notifications








