స్పెషల్ ఎడిషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ ఎక్స్‌డిఐ విడుదల

By Ravi

ప్రస్తుత పండుగ సీజన్‌లో మార్కెట్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు, దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ కారు 'స్విఫ్ట్' ఓ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. మారుతి స్విఫ్ట్ ఎక్స్‌‌డిఐ (Maruti Swift XDi) పేరుతో లభ్యం కానున్న ఈ స్పెషల్ ఎడిషన్‌ను బేస్ డీజిల్ వేరియంట్ ఎల్‌డిఐ వేరియంట్ ఆధాంగా చేసుకొని తయారు చేశారు.

ఈ స్పెషల్ ఎడిషన్ మారుతి స్విఫ్ట్ ఎక్స్‌డిఐ కేవలం డీజిల్ వేరియంట్లో మాత్రమే లభ్యం కానుంది. ఇందులో అదనంగా డబుల్-డిన్ మ్యూజిక్ సిస్టమ్, ఫ్రంట్ పవర్ విండోస్, ఆర్-లెథర్ సీట్ కవర్స్, టిల్ట్ స్టీరింగ్, కీలెస్ ఎంట్రీ, రియర్ పార్కింగ్ సెన్సార్స్, స్పెషల్ డోర్ సిల్ గార్డ్స్, టర్న్ ఇండికేటర్లతో కూడిన వింగ్ మిర్రర్స్ మరియు ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.

Swift XDi

ఇన్ని అదనపు ఫీచర్లు కలిగిన స్విఫ్ట్ ఎక్స్‌డిఐ స్పెషల్ ఎడిషన్ ధర రూ.6.67 లక్షలు (ఎక్స్-షోరూమ్, జైపూర్)గా ఉంది. ఇది రెగ్యులర్ ఎల్‌డిఐ వేరియంట్ కన్నా సుమారు రూ.40,00 అదనం. ఇదే కాకుండా, మారుతి సుజుకి ఈ స్పెషల్ ఎడిషన్ వేరయంట్ స్విఫ్ట్ ఎక్స్‌డిఐపై రూ.20,000 ఎక్సేంజ్ బోనస్, రూ.15,000 లాయల్టీ బోనస్‌లను కూడా ఆఫర్ చేస్తుంది.

ఈ స్పెషల్ ఎడిషన్ మారుతి స్విఫ్ట్ ఎక్స్‌డిఐ వేరియంట్లో యాంత్రికపరమైన మార్పులేవీ లేవు. ఇందులో ఉపయోగించిన 1.3 లీటర్ ఫియట్ మల్టీజెట్ టర్బో డీజిల్ ఇంజన్ గరిష్టంగా 75 బిహెచ్‌పిల శక్తిని, 190 ఎన్ఎమ‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 18, 2013, 16:21 [IST]
English summary
Maruti Suzuki has launched a special edition Swift hatchback called as Swift XDi. Based on the base diesel LDi variant, the Swift XDi comes with additional features. The new Swift XDi is priced at Rs 6.67 lakh (ex-showroom, Jaipur).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+