మారుతి సుజుకి వ్యాగన్ఆర్ స్టింగ్‌రే విడుదల; ధర రూ.4.09 లక్షలు

By Ravi

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా, భారతీయులకు మరొక కొత్త కారును పరిచయం చేసింది. కంపెనీ అందిస్తున్న వ్యాగన్ఆర్ సిరీస్‌లో 'వ్యాగన్ఆర్ స్టింగ్‌రే' (WagonR Stingray) పేరుతో ఓ సరికొత్త పెట్రోల్ కారును మారుతి సుజుకి విడుదల చేసింది. ఈ కొత్త మారుతి సుజుకి వ్యాగన్ఆర్ స్టింగ్‌రే కారు మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • మారుతి సుజుకి వ్యాగన్ఆర్ స్టింగ్‌రే ఎల్ఎక్స్ఐ: రూ.4,09,999
  • మారుతి సుజుకి వ్యాగన్ఆర్ స్టింగ్‌రే విఎక్స్ఐ: రూ.4,37,999
  • మారుతి సుజుకి వ్యాగన్ఆర్ స్టింగ్‌రే విఎక్స్ఐ (ఆప్షనల్): రూ.4,66,999

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


మారుతి సుజుకి వ్యాగన్ఆర్ స్టింగ్‌రే కారులో 1.0 లీటర్ కె10 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు (ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న రెగ్యులర్ వ్యాగన్ఆర్‌, ఆల్టో కె10, ఏ-స్టార్ మరియు ఎస్టిలో కార్లలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు).

ఈ ఇంజన్ గరిష్టంగా 68 పిఎస్‌ల శక్తిని, 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. వ్యాగన్ఆర్ స్టింగ్‌రే ప్రస్తుతానికి పెట్రోల్‌ వెర్షన్‌లో మాత్రమే లభ్యం కానుంది. రెగ్యులర్ వెర్షన్ మాదిరిగా ఇందులో సిఎన్‌జి వేరియంట్ అందుబాటులో లేదు. ఈ కారుకు సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

WagonR Stingray

More from DriveSpark

Article Published On: Wednesday, August 21, 2013, 13:52 [IST]
English summary
Maruti Suzuki has just launched its premium WagonR Stingray in India at the starting price of INR 4.09 Lakhs (ex-showroom, Delhi). It is powered by the same 1.0-Litre K10 petrol engine (which does duties in the regular Wagon R, Alto K10, A-star and Estilo) and is rated at 68PS and 90Nm. The engine comes mated to a 5-Speed manual transmission.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+