టొయోటా ఇన్నోవాకు పోటీగా కొత్త మారుతి సుజుకి ఎమ్‌పివి

By Ravi

అతి తక్కువ ధరకే ఎర్టిగా ఎమ్‌పివిని ప్రవేశపెట్టి, ఈ సెగ్మెంట్లో సంచలనం సృష్టించిన మారుతి సుజుకి, తాజాగా మరో కొత్త ఎమ్‌పివిని అభివృద్ధి చేస్తోంది. ఈసారి నేరుగా ఎమ్‌పివి సెగ్మెంట్లో రారాజుగా ఉన్న టొయోటా ఇన్నోవాను ఢీకొట్టేలా మారుతి తమ కొత్త ఎమ్‌పివి తయారు చేస్తోంది. ఆర్ఎక్స్ (RX) అనే కోడ్‌నేమ్‌తో కంపెనీ ఓ సరికొత్త ఎమ్‌పివిని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

వాస్తవానికి ఎమ్‌పివి సెగ్మెంట్లోకి లేటెస్ట్‌గా నిస్సాన్ ఇవాలియా, చెవర్లే ఎంజాయ్, మారుతి ఎర్టిగా వంటి మోడళ్లు ఎన్ని వచ్చినప్పటికీ, టొయోటా ఇన్నోవాకు గట్టి పోటీని ఇవ్వలేకపోయాయి. ఇన్నోవా మార్కెట్లోకి విడుదలైనప్పటి నుంచి (2000వ సంవత్సరంలో) ఇప్పటి వరకు ఇది బెస్ట్ సెల్లింగ్ ఎమ్‌పివిగా ఉందంటేనే, కస్టమర్లలో మోడల్‌కు ఉన్న క్రేజ్ ఎంటో అర్థమైపోతుంది.

Maruti Suzuki Planning MPV To Rival Innova

మారుతి సుజుకి అంతర్గత సిబ్బంది నుంచి ఓ ఆంగ్ల పత్రికకు అందిన సమాచారం ప్రకారం, కంపెనీ అభివృద్ధి చేస్తున్న ఆర్ఎక్స్ ఎమ్‌పివి కోసం ఇప్పటికే సి.వి. రామన్ అనే వ్యక్తిని ఈ ఉత్పత్తికి ఛీఫ్ ఇంజనీర్‌గా నియమించినట్లు సమాచారం. మారుతి సుజుకి కంపెనీకి విడిభాగాలు సరఫరా చేసే ఓ సప్లయర్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించినట్లు సదరు వార్తాపత్రిక పేర్కొంది.

ఈ సమాచారాన్ని బట్టి చూస్తే, మారుతి సుజుకి ప్రస్తుతం అందిస్తున్న ఎర్టిగా ఎమ్‌పివికి ఎగువన ఓ సరికొత్త ప్రీమియం ఎమ్‌పివిని విడుదల చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఎర్టిగా మాదిరిగా కాకుండా ఆర్ఎక్స్ ఎమ్‌పివిలో పెద్ద డీజిల్ ఇంజన్ (బహుశాల్ 2.0 లీటర్ ఇంజన్ అయి ఉండొచ్చు) ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇంజన్‌ను జపాన్‌లోని తమ మాతృ సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్ అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, November 28, 2013, 17:15 [IST]
English summary
Indian automobile sector leader and small car specialists Maruti Suzuki is working on developing a full size MPV that will take on segment leader, Toyota Innova. The rumored vehicle, codenamed RX is still quite sometime away from being production ready, which is unlikely to happen before 2017.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+