స్టీరింగ్ సమస్య: 4 మోడళ్ల మారుతి సుజుకి కార్లు రీకాల్
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి మరోసారి భారత్‌లో రీకాల్‌ను ప్రకటించింది. కంపెనీ విక్రయించిన నాలుగు మోడళ్లలో స్టీరింగ్ లోపం కారణంగా రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే, అదృష్టవశాత్తు ఈ రీకాల్‌లో కేవలం 1492 కార్లు మాత్రమే ఉన్నాయి.
అక్టోబర్ 19, 2013 నుంచి అక్టోబర్ 26, 2013 మధ్య కాలంలో ఉత్పత్తి చేసిన ఎర్టిగా ఎమ్‌పివి, స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, స్విఫ్ట్ డిజైర్ సెడాన్ మరియు ఏ-స్టార్ ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్ కార్లను కంపెనీ రీకాల్ చేసింది. రీకాల్ చేసిన మొత్తం 1492 కార్లలో 306 ఎర్టిగాలు, 592 స్విఫ్ట్‌లు, 581 స్విఫ్ట్ డిజైర్‌లు మరియు 13 ఏ-స్టార్ కార్లున్నాయి.
ఈ కార్లలోని స్టీరింగ్ కాలమ్‌లో ఏదైనా లోపాన్ని గుర్తింగి సదరు స్టీరింగ్ కాలమ్‌ను ఉచితంగా రీప్లేస్ చేస్తామని మారుతి సుజుకి ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రీకాల్‌కు సంబంధించి కంపెనీ తమ కస్టమర్లను ప్రత్యేకంగా సంప్రదించి, వారికి ఈ సమస్య గురించి వివరిచనుంది.

ఈ రీకాల్ నిర్దేశిత రేంజ్‌లోని వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని, ఇది వేరే ఇతర వాహనాలకు/మోడళ్లకు లేగా కంపెనీ ఎగుమతి చేసిన మోడళ్లకు వర్తించదని మారుతి వివరించింది. ఇప్పటికే కొత్త స్టీరింగ్ కాలమ్‌ను డీలర్ వర్క్‌షాప్‌లకు పంపించామని కంపెనీ ఆ ప్రకటనలో పేర్కొంది.
ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు
అక్టోబర్ 19 తర్వాత పైన తెలిపిన కార్లను కొనుగోలు చేసిన కస్టమర్లు www.marutisuzuki.com వెబ్‌సైట్‌ను సందర్శించి, తమ వాహనం యొక్క ఛాస్సిస్ నెంబర్‌ను నమోదు చేయటం ద్వారా, తమ కారు ఈ రీకాల్ వర్తిస్తుందో లేదో తెలుసుకోవచ్చు. లేదంటే, మీ సమీపంలో అధీకృత మారుతి సుజుకి డీలరును సంప్రదించవచ్చు.


Click it and Unblock the Notifications








