మార్చ్ నెలలో 5 శాతం తగ్గిన మారుతి కార్ల అమ్మకాలు

ఇదే సమయంలో కంపెనీ ఎగుమతులు కూడా 8.93 శాతం క్షీణించి 13,228 యూనిట్ల నుంచి 12,047 యూనిట్లకు పడిపోయాయి. అయితే, మొత్తమ్మీద గడచిన ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ అమ్మకాలు పరిశీలిస్తే, అవి 11,33,695 యూనిట్ల నుంచి 11,71,434 యూనిట్లకు పెరిగి 3.33 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కంపెనీ తాజాగా ప్రవేశపెట్టిన సరికొత్త మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పి కంపెనీ అమ్మకాలను పెంచడంలో కీలక పాత్ర పోషిచిందని చెప్పవచ్చు.
గడచిన నెలలో ఎమ్800, ఏ-స్టార్, ఆల్టో, వ్యాగన్ఆర్ వంటి చిన్న కార్ల అమ్మకాలు 52,826 యూనిట్ల నుంచి 45,047 యూనిట్లకు పడిపోయి 14.73 శాతం క్షీణతను నమోదు చేశాయి. ఎస్టిలో, స్విఫ్ట్, రిట్జ్ వంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు 7.33 శాతం తగ్గి 27,913 యూనిట్ల నుంచి 25,868 యూనిట్లకు పడిపోయాయి. అయితే, స్విఫ్ట్ డిజైర్ అమ్మకాలు మాత్రం 16,451 యూనిట్ల నుంచి 20,078 యూనిట్లకు పెరిగి 22.05 శాతం వృద్ధిని కనబరచాయి.
మారుతి సుజుకి అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ ఎస్ఎక్స్4 అమ్మకాలు 1,520 యూనిట్ల నుంచి 903 యూనిట్లకు పడిపోయి 40.59 శాతం క్షీణతను నమోదు చేయగా, లగ్జరీ సెడాన్ కిజాషి ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోలేదు. కంపెనీ అందిస్తున్న యుటిలిటీ వాహనాల అమ్మకాలు మాత్రం నాలుగు రెట్లు పెరిగా 1,530 యూనిట్ల నుంచి 6,488 యూనిట్లకు పెరిగాయి (ఎర్టిగా ఎఫెక్ట్). వ్యాన్‌ల అమ్మకాలు కూడా 23.56 శాతం తగ్గి 12,436 యూనిట్ల నుంచి 9,506 యూనిట్లకు పడిపోయాయి.


Click it and Unblock the Notifications








