124 రోజుల్లో లక్ష ఆల్టో 800 కార్లను విక్రయించిన మారుతి

By Ravi

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఇటీవల దేశీయ విపణిలో ప్రవేశపెట్టిన అప్‌గ్రేడెడ్ స్టయిలిష్ చిన్న కారు ఆల్టో 800కు మార్కెట్ నుంచి స్పందన లభించింది. పెట్రోల్ కార్ల అమ్మకాలు స్తబ్ధుగా ఉన్నప్పటికీ, దీని ఆకర్షనీయమైన డిజైన్, మెరుగైన్ మైలేజ్‌లతో ఇది కొనుగోలుదారులను ఆకట్టుకోవటంలో విజయం సాధించిందిం.

కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 కారు మార్కెట్లో విడుదలైన 124 రోజుల్లోనే, ఇవి లక్ష యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయంటే, ఈ మోడల్‌కు ఉన్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థవుతుంది. గడచిన సంవత్సరం అక్టోబర్ నెలలో మారుతి సుజుకి తమ కొత్త ఆల్టో 800 కారును విడుదల చేసింది. ఇది పెట్రోల్, సిఎన్‌జి ఇంధన ఆప్షన్లతో మూడు వేరియంట్లలో (స్టాండర్డ్, ఎల్ఎక్స్, ఎల్ఎక్స్ఐ) లభ్యమవుతుంది.

కొత్త ఆల్టో 800 కారులో ఉపయోగించిన రీడిజైన్డ్ 796సీసీ, 3-సిలిండర్, 12-వాల్వ్ పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 47.5 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 69 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, పెట్రోల్ వెర్షన్ ఆల్టో 800 లీటరుకు 22.74 కి.మీ. మైలేజీని, సిఎన్‌జి వెర్షన్ ఆల్టో 800 కేజీకి 30.46 కి.మీ. మైలేజీని ఇస్తాయి.

New Alto 800

More from DriveSpark

Article Published On: Tuesday, March 26, 2013, 10:40 [IST]
English summary
The Indian automobile industry might be reeling under pressure due to increased fuel prices and increased excise duty, but these do not seem to have affected Maruti Suzuki India, which has gone on to set another record. India's largest car manufacturer, in terms of sales, earlier this month, managed to sell one lakh Alto 800 compact hatchbacks in a record 124 days.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+