సైలెంట్‌గా మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ విడుదల

By Ravi

మారుతి సుజుకి అందిస్తున్న పాపులర్ రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌లో ఆటోమేటిక్ వేరియంట్‌ గురించి మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. నూతన సంవత్సర కానుకగా మారుతి సుజుకి సైలెంట్‌గా ఆటోమేటిక్ రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌ను మార్కెట్లో విడుదల చేసింది. రాష్ట్ర మార్కెట్లో మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ ధర రూ.6.29 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది. ఇది కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో (విక్స్ఐ వేరియంట్) మాత్రమే లభ్యమవుతుంది. ఇప్పటికే రిట్జ్ ఆటోమేటిక్‌ను బుక్ చేసుకున్న వారికి జనవరి 15, 2012 నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి.

కంపెనీ అందిస్తున్న ఏ-స్టార్ హ్యాచ్‌బ్యాక్, స్విఫ్ట్ డిజైర్ సెడాన్లలో ఉపయోగించిన 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌నే ఆటోమేటిక్ వేరియంట్ మారుతి సుజుకి రిట్జ్‌లోను ఉపయోగించారు. ఇందులో అమర్చిన 1.2 లీటర్ కె12 పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 83 బిహెచ్‌పిల శక్తిని, 114 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ వేరియంట్ లీటర్ పెట్రోల్‌కు 17.16 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది ఈ సెగ్మెంట్లోని బ్రయో ఆటోమేటిక్ (5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్), హ్యుందాయ్ ఐ10 ఆటోమేటిక్ (4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్) కార్లకు పోటీగా నిలువనుంది.

Ritz

More from DriveSpark

Article Published On: Wednesday, January 2, 2013, 16:49 [IST]
English summary
Maruti Suzuki has silently launched the automatic variant of its popular Ritz hatchback. Maruti has priced the Ritz auto at Rs 6.29 lakh (ex-showroom, Hyderabad). The leading Indian carmaker has updated its website with details about the upcoming automatic Ritz variant. Deliveries will commence by January 15, 2013.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+