2014లో మారుతి స్విఫ్ట్, డిజైర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్స్
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పో అనేక కొత్త కార్ల ఆవిష్కరణకు వేదిక కానుంది. దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) కూడా ఈసారి కొత్త మోడళ్లతో పాటుగా, అప్‍గ్రేడెడ్ మోడళ్లను కూడా ఆవిష్కరించనుంది.
మారుతి సుజుకి నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ మోడళ్లలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల కావచ్చని తెలుస్తోంది. 2005లో విడుదలైన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మంచి సక్సెస్‌ను సాధించడంతో కంపెనీ 2011లో ఇందులో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది.

ఈ 2011 ఫేస్‌లిఫ్ట్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌ను తీర్చిదిద్దింది. కొత్త స్విఫ్ మాదిరిగానే కొత్త స్విఫ్ట్ డిజైర్ కూడా ఆశించినదాని కన్నా ఎక్కువ సక్సెస్‌ను మారుతి సుజుకి ఇండియాకు తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో మారుతి స్విఫ్ట్ అగ్రస్థానంలో ఉంటే, కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో స్విఫ్ట్ డిజైర్ మార్కెట్ లీడర్‌గా ఉంది. ఈ పాపులారిటీని క్యాష్ చేసుకునేందుకు, మారుతి సుజుకి ఈ రెండు మోడళ్లలో మరోసారి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నాటికి ఇవి మార్కెట్లోకి రావచ్చని సమాచారం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








