పెట్రోల్ కార్ల ఉత్పత్తిని తగ్గించనున్న మారుతి సుజుకి
భారత ఆటోమొబైల్ మార్కెట్లో అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో, ఇటు డీలర్ల వద్ద అటు కార్ల తయారీదారుల వద్ద స్టాక్ కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో, దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా తమ గుర్గావ్ ప్లాంటులో పెట్రోల్ కార్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయనుంది. కేవలం పెట్రోల్ కార్లకే కాకుండా డీజిల్ కార్లకు కూడా డిమాండ్ తక్కువగా ఉంటోంది. డీలర్ల గోడన్లలో దాదాపు ఒక నెలకు సరిపడా స్టాక్ ఉన్నట్లు సమాచారం.
ఫిబ్రవరి 2012 నెలతో పోల్చుకుంటే ఫిబ్రవరి 2013 నెలలో మారుతి సుజుకి ఇండియా అమ్మకాలు 7.89 శాతం తగ్గి 1,09,567 యూనిట్లకు పరిమితం అయ్యాయి. ఫిబ్రవరి 2012లో ఇవి మొత్తం 1,18,949 యూనిట్లుగా నమోదయ్యాయి. గడచిన నెలలో నమోదైన మొత్తం అమ్మకాల్లో దేశీయ మార్కెట్లో కేవలం 97,955 కార్లను మాత్రం కంపెనీ విక్రయించి అమ్మకాల్లో 9.01 క్షీణతను నమోదు చేసింది. అంతకు ముందు సంవత్సరం ఇదే నెలలో ఇవి 1,07,653 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

అయితే, ఇదే సమయంలో కంపెనీ ఎగుమతులు మాత్రం 2.80 శాతం వృద్ధిని కనబరిచి 11,296 యూనిట్ల నుంచి 11,612 యూనిట్లకు పెరిగాయి. ఎమ్800, ఏ-స్టార్, ఆల్టో, వ్యాగన్ఆర్ వంటి చిన్న కార్ల అమ్మకాలు 15.87 క్షీణించి 49,104 యూనిట్ల నుంచి 41,311 యూనిట్లకు పడిపోయాయి. ఎస్టిలో, స్విఫ్ట్, రిట్జ్ వంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు 13.90 శాతం క్షీణించి 27,899 యూనిట్ల నుంచి 24,021 యూనిట్లకు తగ్గాయి. డిజైర్ అమ్మకాలు మాత్రం 21.56 శాతం వృద్ధి చెంది 15,068 యూనిట్ల నుంచి 18,316 యూనిట్లకు పెరిగాయి.
మిడ్-సైజ్ సెడాన్ ఎస్ఎక్స్4 అమ్మకాలు 89.42 శాతం క్షీణించి 2,033 యూనిట్ల నుంచి 215 యూనిట్లకు పడిపోయాయి. గడచిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో 14 యూనిట్ల అమ్ముడుపోయిన లగ్జరీ సెడాన్ కిజాషి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కేవలం రెండు కార్లు మాత్రమే అమ్ముడయ్యాయని కంపెనీ వివరించింది.


Click it and Unblock the Notifications








