సిఎన్‌జి వెర్షన్ స్టింగ్‌రే విడుదల చేయనున్న మారుతి సుజుకి
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా, ఇటీవల దేశీయ విపణిలో 'స్టింగ్‌రే' (Stingray) అనే కొత్త హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. మారుతి స్టింగ్‌రే ప్రస్తుతానికి కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభ్యమవుతోంది. కాగా, ఇందులో సిఎన్‌జి వెర్షన్‌ను కూడా మారుతి సుజుకి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
సిఎన్‌జి ఇంధనం అందుబాటులో ఉండే అర్బన్ నగరాల్లో స్టింగ్‌రే సిఎన్‌జి వెర్షన్‌ను ప్రవేశపెట్టినట్లయితే, ఇది మంచి సక్సెస్‌ను సాధించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. పెట్రోల్ ఇంధనంతో పోల్చుకుంటే, సిఎన్‌జి ఇంధనం తక్కువగా ఉండటమే కాకుండా, ఎక్కువ మైలేజ్ కూడా లభిస్తుంది. ఇప్పటికే మారుతి అందిస్తున్న సిఎన్‌జి వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

మారుతి సుజుకి జోరుకు చెక్ పెట్టేందుకు హ్యుందాయ్ కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తున్న నేపథ్యంలో, మారుతి సుజుకి తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో భాగంగానే, మారుతి స్టింగ్‌రేలో త్వరలోనే సిఎన్‌జి వెర్షన్‌ను కంపెనీ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పెట్రోల్ వెర్షన్ మారుతి సుజుకి స్టింగ్‌రే విషయానికి వస్తే, ఇది మూడు వేరియంట్లలో లభ్యమతుంది, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
- స్టింగ్‌రే ఎల్ఎక్స్ఐ: రూ.4,09,999
- స్టింగ్‌రే విఎక్స్ఐ: రూ.4,37,999
- స్టింగ్‌రే విఎక్స్ఐ (ఆప్షనల్): రూ.4,66,999
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
మారుతి సుజుకి స్టింగ్‌రే కారులో 1.0 లీటర్ కె10 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు ఈ ఇంజన్ గరిష్టంగా 68 పిఎస్‌ల శక్తిని, 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.



Click it and Unblock the Notifications








