ప్రీమియం 'వ్యాగన్ఆర్‌'ను విడుదల చేయనున్న మారుతి

By Ravi

దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న చిన్న కారు 'వ్యాగన్ఆర్'లో ఓ సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ సన్నాహాలు చేస్తుంది. భారత మార్కెట్లో వ్యాగన్ఆర్ మంచి సక్సెస్‌ను సాధించింది. ప్రతినెలా 16,000 యూనిట్లకు పైగా వ్యాగన్ఆర్ కార్లు అమ్ముడుపోతున్నాయి. ఈ నేపథ్యంలో, వ్యాగన్ఆర్ అమ్మకాలు మరింత ఊతమిచ్చేందుకు ఇందులో ఆకర్షనీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లు కలిగిన ఓ సరికొత్త వేరియంట్‌ను కంపెనీ విడుదల చేయనున్నట్లు సమాచారం.

గడచిన సంవత్సరం మారుతి సుజుకి ఇండియా మాతృ సంస్థ అయిన సుజుకి మోటార్ కార్పోరేషన్ ఆవిష్కరించిన 'వ్యాగన్ఆర్ స్టింగ్‌రే' కారును ఇండియన్ మార్కెట్లో కూడా విడుదల చేస్తే వ్యాగన్ఆర్ బ్రాండ్ మరింత పటిష్టమయ్యే అవకాశాలున్నట్లు కంపెనీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం మన మార్కెట్లో లభిస్తున్న వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌తో పోల్చుకుంటే ఈ కొత్త వ్యాగన్ఆర్ స్టింగ్‌రే హ్యాచ్‌బ్యాక్‌లో డిజైన్ పరంగాను, ఫీచర్ల పరంగాను అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి.

స్మాల్ బాక్సీ షేప్‌లో ఉండే ఈ 2013 సుజుకి వ్యాగన్ఆర్ రెండవ తరానికి చెందినది. ఇది చూడటానికి మినీ వ్యాన్‌లా ఉన్నప్పటికీ, ఇందులో సాధారణ కార్లలో ఉండే అన్ని సౌకర్యవంతమైన ఫీచర్లు ఉంటాయి. లాంగ్ రైడ్‌లకు సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేసిన సీటింగ్, విశాలమైన హెడ్‌రూమ్ అండ్ లెగ్‌రూమ్, వెనుక వరుసలో విశాలమైన సీట్లు ఉన్నాయి. అవసరం లేదనుకుంటే ఈ వెనుక సీట్లను మడిచిపెట్టి, ఆ స్థలాన్ని లగేజ్ స్పేస్ కోసం వాడుకోవచ్చు.

మార్కెట్ వర్గాల సమాచారం ప్రస్తుతం దేశీయ విపణిలో లభిస్తున్న వ్యాగన్ఆర్‌తో పాటుగానే ఈ కొత్త వ్యాగన్ఆర్ స్టింగ్‌రే కూడా లభ్యమయ్యే ఆస్కారం ఉంది. అయితే, దీని ప్రీమియం ఫీచర్ల వలన ధర విషయంలో ఇది ప్రస్తుత వ్యాగన్ఆర్ కన్నా కాస్తంత అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న వ్యాగన్ఆర్ ధరలు రూ.3.57 లక్షల నుంచి రూ.4.44 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

మారుతి వ్యాగన్ఆర్‌

మారుతి వ్యాగన్ఆర్‌

More from DriveSpark

Article Published On: Tuesday, April 23, 2013, 15:49 [IST]
English summary
Maruti Suzuki is looking to expand its product portfolio. As per reports, a newer and upgraded version of the WagonR, known as the ‘WagonR Stingray’ could be launched in India sometime in the near future.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+