వాణిజ్య వాహనాల ఉత్పత్తిని ప్రారంభించనున్న మారుతి

By Ravi

Maruti Suzuki To Start Making Commercial Vehicles
భారతదేశపు అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఓ తేలికపాటి వాణిజ్య వాహనాన్ని (ఎల్‌సివి) మార్కెట్లోకి తీసుకురానుందని గతంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. ఇప్పుడు ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.

ఈ సెగ్మెంట్లో టాటా మోటార్స్ అందిస్తున్న ఏస్ ఎల్‌సివికి పోటీగా ఓ తేలికపాటి వాణిజ్య వాహనాన్ని తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, రానున్న రెండేళ్లలో ఈ మోడల్‌ను ప్రవేశపెట్టనున్నామని మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్‌సీ భార్గవ వెల్లడించారు.

మారుతి సుజుకి మాతృసంస్థ, జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్స్ గ్లోబల్ మార్కెట్లోల అందిస్తున్న ‘క్యారీ' వాహనం ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త ఎల్‌సివిని అభివృద్ధి చేయనున్నామని ఆయన వివరించారు. ఇది డీజిల్, సీఎన్‌జీ ఫ్యూయెల్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

వాస్తవానికి మారుతి సుజుకి 1983లోనే క్యారీని భారత్‌లో ప్రవేశపెట్టాలని భావించింది. ఈ నేపథ్యంలో, క్యారీ కోసం అప్పట్లో కంపెనీ చిన్న కారు ఎమ్ 800తో పాటు ముందుగానే బుకింగ్స్ కూడా జరిపింది. అయితే, ఎమ్ 800కి 1.21 లక్షల బుకింగ్స్ రాగా, క్యారీకి 2,000 మాత్రమే వచ్చాయి. దీంతో క్యారీని భారత్‌లో ప్రవేశపెట్టే యోచనను మారుతి విరమించుకుంది.

గుజరాత్‌లోని ప్లాంటులో లైట్ కమర్షియల్ వెహికల్స్ (ఎల్‌సివి)ని ఉత్పత్తి చేయాలని భావిస్తున్నామని మారుతి సుజుకి ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం, వై9టి (Y9T) అనే కోడ్‌నేమ్‌తో మారుతి సుజుకి ఓ కొత్త ఎల్‌సివిని అభివృద్ధి చేస్తుంది. ఈ ఎల్‌‍‌సివిలో 2-సిలిండర్, 800సీసీ డీజిల్ ఇంజన్‌‌ను ఉపయోగించనున్నారు. ప్రస్తుతం ఈ ఇంజన్ అభివృద్ధి అడ్వాన్స్‌డ్ స్థాయిలో ఉన్నట్లు సమాచారం.

More from DriveSpark

Article Published On: Monday, July 29, 2013, 12:34 [IST]
English summary
While Maruti Suzuki is a market leader in the compact passenger vehicle segment in India, it does not have a presence in the commercial vehicle segment, a void it wants to fill in soon. The automaker has confirmed that it will enter the Light Commercial Vehicle segment with the introduction of a brand new model.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+