హ్యుందాయ్ ఐ10 గ్రాండ్‌కు చెక్ పెట్టేందుకు మారుతి స్మాల్ కార్

ఈ విషయంలో మారుతి సుజుకి మాత్రం ఏం తక్కువ తినలేదు. హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ నుంచి ఎదురయ్యే పోటీని గట్టిగా తిప్పికొట్టేందుకు, మారుతి సుజుకి కూడా ఓ కాంపాక్ట్ డీజిల్ కారును అభివృద్ధి చేస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ కాంపాక్ట్ కారు మార్కెట్లోకి రానుంది. ఫిబ్రవరి 2014లో జరగనున్న అంతర్జాతీయ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మారుతి ఈ చిన్న డీజిల్ కారును తొలిసారిగా ప్రజలకు ప్రదర్శించే అవకాశం ఉంది.
అయితే, హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ మాత్రం వచ్చే నెల 3వ తేదీనే భారత మార్కెట్లో విడుదల కానుంది. మారుతి కాంపాక్ట్ కారు విడుదలయ్యే లోపే, ఐ10 గ్రాండ్ ఈ సెగ్మెంట్లోని అవకాశాలన్నింటినీ ఎగరేసుకుపోనుంది. మారుతి తయారు చేస్తున్న ఈ కొత్త కాంపాక్ట్ డీజిల్ కారును ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న వ్యాగన్ఆర్, స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లకు మధ్యలో ప్రవేశపెట్టనున్నారు.


Click it and Unblock the Notifications








