గోల్డ్‌రష్ ర్యాలీలో అపశృతి; నుజ్జు నుజ్జయిన మెక్‌లారెన్

By Ravi

ఈనెల 8న ప్రారంభమైన వరల్డ్ ఫేమస్ 2013 గోల్డ్‌‌రష్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. ఇందులో పాల్గొన్న ఓ వ్యక్తి మెక్‌లారెన్ ఎమ్‌పి4-12సి సూపర్‌కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి హైవే పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టుకొని నుజ్జు నుజ్జుయిపోయింది. రోడ్డుపై వెళ్తున్న ట్రక్కును ఓవర్‌టేక్ చేయటంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు ఇందులోని డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు.

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12సి విషయానికి వస్తే, ఈ సూపర్‌కారులో 616 హెచ్‌పిల గరిష్ట శక్తిని ఉత్పత్తి చేసే 3.8 లీటర్ వి8 ట్విన్ టర్బో ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 7-స్పీడ్ ఎస్ఎస్‌జి డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. దీని వలన ఇది కేవలం 3.1 సెకండ్ల వ్యవధిలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 328 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. మన దేశ కరెన్సీలో ఈ కారు ధర రూ.2 కోట్లకు పై మాటే.

కాగా.. శాన్ ఫ్రాన్సిస్కోలో జూన్ 8, 2013 ప్రారంభమైన ఈ 2013 ఎడిషన్ గోల్డ్‌‌రష్ ర్యాలీ లాస్ ఏంజిల్స్, లాస్ వేగాస్, డల్లాస్, మెంఫిస్, సెయింట్ లూయిస్ మీదుగా ప్రయాణించి జూన్ 15, 2013న చికాగోలో ముగుస్తుంది. ఇప్పటి వరకు నాలుగు సక్సెస్‌ఫుల్ గోల్డ్‌రష్ ర్యాలీ సీజన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్నది 5 సీజన్. ఈ ర్యాలీ ప్రారంభమైన కేవలం నాలుగు నెలల్లోనే ఇది ప్రీమియం లైఫ్‌స్టయిల్ ర్యాలీగా పేరు దక్కించుకుంది.

McLaren Crash

Source: FB

More from DriveSpark

Article Published On: Friday, June 14, 2013, 10:54 [IST]
English summary
In strange insident a poor McLaren MP4-12C crashed on goldRush Rally. Luckily the driver was unhurt in this accident. The McLaren MP4-12C is powered by a twin-turbocharged 3.8-liter V8 making 616 horsepower.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+