నవంబర్ 12న మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ సెలబ్రేషన్ ఎడిషన్ విడుదల

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ మేకర్ మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న సి-క్లాస్ సెడాన్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ మోడల్ కార్లు ప్రపంచ వ్యాప్తంగా ఒక కోటి యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఈ విజయాన్ని పురస్కరించుకొని మెర్సిడెస్ బెంజ్ ఇందులో ఓ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను విడుదల చేయనుంది.

సెలబ్రేషన్ ఎడిషన్ పేరిట రానున్న ఈ మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ లగ్జరీ కారు రెగ్యులర్ వేరియంట్‌తో పోల్చుకుంటే మరిన్ని అధనపు ఫీచర్లతో రానుంది. గ్లోబల్ మార్కెట్లలో ఇప్పటికే ఈ సెలబ్రేషన్ ఎడిషన్ మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ లగ్జరీ సెలూన్‌ను కంపెనీ విడుదల చేసింది.

Mercedes Benz C Class

కాగా.. భారత మార్కెట్ విషయానికి వస్తే, ఈ నెల 12 (నవంబర్ 12, 2013)వ తేదీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఈ సెలబ్రేషన్ ఎడిషన్ సి-క్లాస్ కారును విడుదల చేయనుంది. ఈ స్పెషల్ ఎడిషన్ సి-క్లాస్‌‌కు మెర్సిడెస్ బెంజ్ పెర్ఫామెన్స్ డివిజన్ అయిన ఏఎమ్‌జి కిట్‌ను జోడించనున్నారు.

ఏఎమ్‌జి కిట్‌లో భాగంగా కొత్త బంపర్స్, స్పాయిలర్స్ పెద్ద ఏఎమ్‌జి అల్లాయ్ వీల్స్ మరియు సైడ్ స్కర్ట్స్‌ను సి-క్లాస్‌కు జోడించనున్నారు. ఈ సెలబ్రేషన్ ఎడిషన్ సి-క్లాస్ కేవలం సి220 సిడిఐ వేరియంట్లో మాత్రమే లభ్యం కానుంది. ధర, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, November 9, 2013, 16:59 [IST]
English summary
Mercedes Benz is all set to launch the celebration edition of C-Class saloon on completion of sales of 1-crore copies of C-Class globally. Mercedes has launched the Celebration Edition of the C-Class globally and the carmaker will launch the same in India on November 12.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+