మెర్సిడెస్ బెంజ్ నుంచి జిఎల్ఏ క్లాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ సక్సెస్ సాధించడంతో, 'కాంపాక్ట్ ఎస్‌యూవీ' అనే కొత్త సెగ్మెంట్‌ను అభివృద్ధి చేయటం జరిగింది. ఈ సెగ్మెంట్లో ఇప్పటికే నిస్సాన్, రెనో, ఫోర్డ్ వంటి కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టగా, మారుతి సుజుకి, ఫోక్స్‌వ్యాగన్ వంటి మరికొన్ని కంపెనీలు కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీలను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ సెగ్మెంట్లోకి కేవలం చిన్న కార్ కంపెనీలే కాకుండా, లగ్జరీ కార్ కంపెనీలు కూడా అడుగు పెట్టేందుకు మక్కువ చూపుతున్నాయి.
తాజాగా జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ అందిస్తున్న జిఎల్ఏ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, ఇందులో ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేసేందుకు మెర్సిడెస్ బెంజ్ శ్రీకారం చుట్టింది. మెర్సిడెస్ బెంజ్ ఇప్పటికే తమ కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన స్కెచ్‌లను తమ అధికారిక ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజీలో విడుదల చేసింది.

ఈ కారును మెర్సిడెస్ లేటెస్ట్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఎమ్ఎఫ్ఏ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కూడా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌పై ఇప్పటికే ఏ-క్లాస్, బి-క్లాస్, సిఎల్ఏ సెడాన్లను తయారు చేస్తున్నారు. మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏను ఈ ఏడాది ఆరంభంలో చైనాలో జరిగిన షాంగై మోటార్ షోలో కాన్సెప్ట్‌గా ప్రదర్శనకు ఉంచారు.
మెర్సిడెస్ బెంజ్ నుంచి రానున్న ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంచుమించు జిఎల్ఏ పరిమాణంలో ఉండనుంది. ఏ-క్లాస్, బి-క్లాస్ వీల్‌బేస్ (2699 మి.మీ.) మాదిరిగానే దీని వీల్‌బేస్ ఉండనుంది. ఇది ఈ సెగ్మెంట్లోని ఆడి క్యూ3, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 వంటి లగ్జరీ కాంపాక్ట్ ఎస్‌యూవీలతో పోటీ పడనుంది. ఇదొక 5-డోర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. దీని స్లోపింగ్ రూఫ్ లైన్ స్లీక్‌గా, స్పోర్టీగా కనిపిస్తుంది.

స్కెచ్‌ను బట్టి చూస్తే, మొత్తమ్మీద ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ రగ్గడ్ లుక్‌ను కలిగి ఉండనుంది. ఇంజన్స్ విషయానికి వస్తే, ఎమ్ఎఫ్ఏ ప్లాట్‌ఫామ్‌పై తయారైన పెట్రోల్, డీజిల్ కార్లలో ఉపయోగించిన ఇంజన్లనే ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలోను ఉపయోగించనున్నారు. మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏలో ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్, సెవన్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, డ్యూయెల్ క్లచ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి. ఈలోపుగా మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ టీజర్ వీడియోను వీక్షించండి.
<center><iframe width="600" height="450" src="//www.youtube.com/embed/9KbGfaiYSSI?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








