ఫ్రాంక్‌ఫర్ట్‌లో విడుదల కానున్న మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ లగ్జరీ కారు ఏ-క్లాస్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని, కంపెనీ ఇందులో ఓ క్రాసోవర్ వెర్షన్‌ను అభివృద్ధి చేసింది. 'మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ'గా పిలిచే ఈ క్రాసోవర్‌ను వచ్చే నెల ఆరంభంలో జరగనున్న 2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో ఆవిష్కరించనున్నారు.
ఈ ఏడాది ఆరంభంలో చైనాలో జరిగిన 2013 షాంగై మోటార్ షోలో కంపెనీ కాన్సెప్ట్ వెర్షన్ జిఎల్ఏ-క్లాస్‌ను తొలిసారిగా ప్రదర్శనకు ఉంచింది. కాగా.. ప్రస్తుతం ప్రొడక్షన్ వెర్షన్ జిఎల్ఏ క్రాసోవర్ అఫీషియల్ ఫొటోలను కంపెనీ విడుదల చేసింది. కొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ ఈ సెగ్మెంట్లోని ఆడి క్యూ3, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1, వోల్వో వి40 వంటి మోడళ్లతో పోటీ పడనుంది.
ఈ క్రాసోవర్‌ను ఎమ్ఎఫ్ఏ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు, ఫలితంగా ఏ-క్లాస్ హ్యాచ్‌బ్యాక్‌లోని అనేక డిజైన్ క్యూలు ఈ కారులో దర్శనమివ్వనున్నాయి. ఇందులో ప్రధానంగా ఏ-క్లాస్ హ్యాచ్‌బ్యాక్‌లో కనిపించే స్కిడ్ ప్లేట్స్, రూఫ్ రెయిల్స్, సైడ్ రన్నింగ్ బార్డర్స్ వంటి డిజైన్ ఫీచర్లు మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ క్రాసోవర్‌లో కూడా కనిపించనున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.



Click it and Unblock the Notifications








