ఏప్రిల్ 1 నుంచి కార్ల ధరలను పెంచనున్న మెర్సిడెస్ బెంజ్
వచ్చే నెల నుంచి ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా అందిస్తున్న లగ్జరీ కార్లు మరింత ప్రియం కానున్నాయి. తాజాగా ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2013-14లో ఎస్‌యూవీలపై ఎక్సైంజ్ సుంకాన్ని, అలాగే సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకునే లగ్జరీ కార్లపై దిగుమతి సుంకాన్ని పెంచిన నేపథ్యంలో, ఆ భారాన్ని కొనుగోలుదారులపై మోపక తప్పడం లేదని కంపెనీ పేర్కొంది.
ఈ మేరకు, మెర్సిడెస్ బెంజ్ ఇండియా స్థానికంగా అసెంబ్లింగ్ చేస్తున్న మోడళ్లపై రూ.1-4 శాతం, సిబియూ రూట్లో దిగుమతి చేసుకునే వాహనాలపై 20 శాతం చొప్పును ధరలను పెంచనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. పెరిగిన ఏప్రిల్ 1, 2013 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. అయితే, ఏయే మోడల్‌పై ఎంత మేర పెంచునున్నామనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.
పెరుగుతున్న ఉత్పాదక వ్యయం, కరెన్సీ ఒడిదుడుకులు, తాజా బడ్జెట్‌లో పెంచిన ఇంపోర్ట్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ వంటి అనేక కారణాల వలన తమ మార్జిన్లపై వత్తి పెరుగుతోందని, అందుకు ఇందులో కొంత భారాన్ని తమ వినియోగదారులపై బదిలీ చేస్తున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎబర్‌హార్డ్ కెర్న్ తెలిపారు.

ఫిబ్రవరి నెలాఖరున పార్లమెంటులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి చిదంబర్ ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2013-14లో రోడ్లపై, పార్కింగ్ ప్రదేశాల్లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించే పెద్ద ఎస్‌యూవీలపై (4 మీటర్ల కన్నా పొడవు ఉండేవి) ఎక్సైజ్ సుంకాన్ని 27 శాతం నుంచి 30 శాతానికి, విదేశాల నుండి దిగుమతి చేసుకునే దేశీయ విపణిలో విక్రయించే కార్లపై దిగుమతి సుంకాన్ని 75 శాతం నుంచి 100 శాతానికి అలాగే 800సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన ఇంపోర్టెడ్ మోటార్‌సైకిళ్లపై దిగుమతి సుంకాన్ని 60 శాతం నుంచి 75 శాతానికి పెంచిన సంగతి తెలిసినదే.


Click it and Unblock the Notifications








