జూన్ 25న వస్తున్న మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఫేస్‌లిఫ్ట్

By Ravi

ఇటీవలే ఏ-క్లాస్ కాంపాక్ట్ లగ్జరీ కారును భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, ఈ నెలలో మరొక సరికొత్త ఉత్పత్తిని మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. మెర్సిడెస్ బెంజ్ ప్రస్తుతం దేశీయ విపణిలో అందిస్తున్న ఈ-క్లాస్ లగ్జరీ కారులో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది.

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2013 మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఈనెల 25న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్ కావటంతో, ఈ కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్‌లో కాస్మోటిక్ మార్పులు చేర్పులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఇందులో యాంత్రికపరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది.

ఇందులో టాప్ ఎండ్ వేరియంట్ 350 సిడిఐ అమ్మకాలను కంపెనీ నిలిపి వేసే ఆస్కారం ఉంది. లుక్ పరంగా ఇది మెర్సిడెస్ బెంజ్ 2013 డెట్రాయిట్ మోటార్ షోలో ఆవిష్కరించిన ఈ-క్లాస్ మాదిరిగా ఉంటుంది. 2013 ఈ-క్లాస్‌లో కొత్త ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన కొత్త హడ్‌లైట్స్ వంటి బాహ్య మార్పులు ఉండనున్నాయి.

రివైజ్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, మార్చబడిన టెయిల్ ల్యాంప్ క్లస్టర్, ఎగ్జాస్ట్ టిప్స్ అలాగే ఇంటీరియర్స్‌లో మెరుగైన క్యాబిన్ స్పేస్, డ్యాష్‌బోర్డుపై డిజైన్ మార్పులు, స్టీరింగ్ వీల్ మరియు కంట్రోల్స్‌పై మార్పులు చేర్పులు ఉండనున్నాయి. ఈ కారు విషయంలో వస్తున్న పుకార్లు నిజమైతే, ఇందులో ఓ పెర్ఫామెన్స్ వెర్షన్ ఏఎమ్‌జి వేరియంట్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Mercedes Benz E Class Facelift

More from DriveSpark

Article Published On: Thursday, June 13, 2013, 11:38 [IST]
English summary
German luxury carmaker Mercedes-Benz India is planning to launch the E-Class facelift in the country on June 25th. Stay tuned to DriveSpark for all the latest news on updated 2013 Mercedes-Benz E-Class.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+