మెర్సిడెస్ బెంజ్ సిల్వర్ యారో కాన్సెప్ట్ కారు
ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ, హాలీవుడ్ రెండూ కలిస్తే ఏమవుతుంది..? ఇంకేముందుకు మన కళ్లకు అద్భుతాల విందే. అలాంటి ఓ అద్భుతమే ఇది. ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్, హాలీవుడ్ స్క్రిప్ట్ రైటర్లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన కాన్సెప్ట్ కారు ఈ 'సిల్వర్ యారో'. గతంలో భవిష్యత్ హాలీవుడ్ చిత్రాల్లో ఉపయోగించేందుకు గాను ఓ కారు తయారు చేసేందుకు లాస్ ఏంజిల్స్ డిజైన్ ఛాలెంజ్ నిర్వహించారు. ఈ పోటీలో అనేక కార్ కంపెనీలు పాల్గొని తమ అధునాతన డిజైన్లను పరిచయం చేశాయి.
అలా పరిచయమైన కార్లలో మెర్సిడెస్ బెంజ్ సిల్వర్ యారో కాన్సెప్ట్ కూడా ఒకటి. ఈ కారును హాలీవుడ్ స్క్రిప్ట్ రైటర్ల సహకారంతో మెర్సిడెస్ బెంజ్ అడ్వాన్స్‌డ్ స్టూడియో అభివృద్ధి చేసింది. 125 ఏళ్ల తమ కంపెనీ చరిత్రలో విప్లవాత్మకమైన ఆటోమోటివ్ టెక్నాలజీ మరియు డిజైన్‌ను ప్రతిభింభింపజేసేలా కంపెనీ ఈ కాన్సెప్ట్‌ను తయారు చేసింది. సిల్వర్ లైట్నింగ్ అనే లఘు చిత్రం (షార్ట్ ఫిల్మ్)లో కూడా మెర్సిడెస్ బెంజ్ సిల్వర్ యారో కాన్సెప్ట్ కారును ఉపయోగించారు. 1930 దశకంలోని రేస్ కార్లను, 1950 దశకంలో ఎస్ఎల్ఆర్ కార్ల డిజైన్ థీమ్‌ను ఆధారంగా చేసుకొని ఈ కాన్సెప్ట్‌ను డిజైన్ చేశారు. ఈ అందమైన వెండి బాణం (సిల్వర్ యారో)పై ఓ కన్నేస్కోండి మరి..!

Click it and Unblock the Notifications