9-స్పీడ్ గేర్‌బాక్సును పరిచయం చేసిన మెర్సిడెస్ బెంజ్

నైన్-స్పీడ్ గేర్‌బాక్స్ ఆఫర్ చేస్తున్న మొదటి కంపెనీ మెర్సిడెస్ బెంజ్ మాత్రం కాదు. ఈ రికార్డును ఇప్పటికే ల్యాండ్ రోవర్ ఎగరేసుకుపోయింది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ ల్యాండ్ రోవర్ ఇటీవలే తమ కారులో 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించింది. దీంతో ల్యాండ్ రోవర్ ప్రపంచంలో కెల్లా 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగిన మొట్టమొదటి కారుగా రికార్డు సృష్టించింది.
ఇదిలా ఉండగా, జర్మనీకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ కూడా ఈసారి ఏకంగా 10 గేర్లు ఉండే ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)ను అభివృద్ధి చేస్తోంది. తమ గ్రూప్ ఓ 10-స్పీడ్ డ్యూయెల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను అభివృద్ధి చేస్తోందని గతంలో ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఛీఫ్ మార్టిన్ వింటర్‌కోర్న్ తెలిపారు. భవిష్యత్తులో ఈ గేర్ల సంఖ్య ఎంత పెరుగుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








