ఫార్ములా వన్ దిగ్గజం మైఖేల్ షుమాకర్ పరిస్థితి విషమం
వరుసగా ఏడు సార్లు ఫార్ములా వన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫార్ములా వన్ రేస్ దిగ్గజం మైఖేల్ షుమాకర్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఆదివారం నాడు ఫ్రెంచ్ ఆల్పాస్‌లో మంచుపై స్కేటింగ్ చేస్తుండగా షుమాకర్ ప్రమాదవశత్తు క్రింద పోడిపోవటంతో, అతని తలకు బలమైన గాయం తగిలింది. ప్రస్తుతం షుమాకర్ కోమాలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
జర్మనీకి చెందిన ఫార్ములా వన్ డ్రైవర్ మైఖేల్ షుమార్ (44 ఏళ్లు) స్కీయింగ్ చేస్తూ, బ్యాలెన్స్ తప్పి పోడిపోవటంతో అతని బండరాయికి తగిలిందని, తీవ్ర రక్తస్రావం కావటంతో బ్రెయిన్ సర్జరీ చేశామని వైద్యులు వెల్లడించారు. మరికొద్ది గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమని సదరు వైద్యులు తెలిపారు.

మైఖేల్ షుమాకర్ తన కెరీర్‌లో మొత్తం 30,5 ఫార్ములా వన్ రేసుల్లో పాల్గొన్నాడు. అందులో 91 విజయాలు, 7 ఛాంపియన్‌షిప్ టైటిళ్లను షుమీ తన ఖాతాలో వేసుకున్నాడు. చిన్నతనం నుంచే ఫార్ములా వన్ రేస్ పట్ల ఆసక్తి ఉన్న మైఖేలు షుమాకర్, ఫార్ములా వన్ రేస్ ట్రాక్‌పై ఇప్పటి వరకూ 80,000 కిలోమీటర్లకు పైగా టైర్లు అరిగేలా చకర్లు కొట్టాడు.
అమెరికాస్ సర్క్యూట్ యొక్క 10వ ల్యాప్ సమయంలో ఈ ప్రకటన వెలువడింది. గడచిన వారంలో జరిగిన రేస్‌లో 10వ ల్యాప్ పూర్తయిన తర్వాత, వివిధ రేస్ ట్రాక్‌ల మైఖేల్ షుమాకర్ ప్రయాణించిన మొత్తం దూరం 80,000 కిలోమీటర్లు (49,710 మైళ్లు)ను దాటింది. ఫార్ములా వన్ కార్లలో మైఖేల్ షుమాకర్ ఇప్పటి వరకూ చుట్టిన దూరంతో, రెండు సార్లు భూమిని చుట్టి రావచ్చట. 19 ఎఫ్ సీజన్స్ పూర్తి చేసిన తర్వాత అతను మొలురాయిని అధిగమించగలిగాడు.


Click it and Unblock the Notifications








