తొలి సంవత్సరంలో సక్సెస్‌ను రుచి చూసిన మినీ

By Ravi

Mini
గడచిన సంవత్సరం జనవరి నెలలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పో ద్వారా ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించిన బిఎమ్‌డబ్ల్యూ ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ మినీ, మొదటి సంవత్సరంలో విజయవంతంగా 300 లకు పైగా వినియోగదారులను సొంతం చేసుకుంది. 2012లో మిని ఇండియా, భారత మార్కెట్లో మొత్తం 302 కార్లను విక్రయించినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. మినీ బ్రాండ్ నెట్‌వర్క్‌కు 100వ దేశమైన భారతదేశంలో మినీ తమ అంచనాలను మించి విజయాన్ని సాధించిందని బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా హెడ్ ఫిలిప్ వోన్ సార్ తెలిపారు.

గతేడాదిలో మినీ ఇండియా 143 మినీ కూపర్ కార్లను, 97 మినీ కన్వర్టిబల్ కార్లను, 62 మినీ కంట్రీమ్యాన్ కార్లను విక్రయించింది. ప్రస్తుతానికి భారత మార్కెట్లో ఈ మూడు మోడళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో మినీ ఇండియా మరిన్ని మోడళ్లను ఇక్కడి మార్కెట్లో విడుదల చేసే ఆస్కారం ఉంది. ఖరీదైన డిజైన్, మెరుగైన నాణ్యత, సాటిలేని పెర్ఫామెన్స్‌లకు మినీ కార్లు పెట్టింది పేరు. మినీ ఇండియా ఇటీవలే దక్షిణభారతదేశంలో మొట్టమొదటి షోరూమ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. హైదరాబాద్‌లో మినీ కార్లకు కున్ మినీ ఎక్స్‌క్లూజివ్ అధీకృత డీలర్‌గా వ్యవహరించనుంది. రాష్ట్ర మార్కెట్లో అందుబాటులో ఉన్న మినీ కార్ల ధరలు ఇలా ఉన్నాయి:

* మినీ కూపర్ - రూ.25.50 లక్షలు
* మినీ కూపర్ ఎస్ - రూ.28.60 లక్షలు
* మినీ కన్వర్టబల్ - రూ.30.70 లక్షలు
* మినీ కంట్రీమ్యాన్- రూ.32.80 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

More from DriveSpark

Article Published On: Thursday, January 10, 2013, 18:33 [IST]
English summary
MINI has made a successful market entry in India with delivery of 302 cars to customers in 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+