నవంబర్ 18న నెక్స్ట్ జనరేషన్ మినీ విడుదల
బిఎమ్‌డబ్ల్యూకి చెందిన లగ్జరీ స్మాల్ కార్ బ్రాండ్ మినీలో కొత్త తర్వాతి తరం (నెక్స్ట్ జనరేషన్) మోడల్‌ను కంపెనీ వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెక్స్ట్ జనరేషన్ మినీ కారు కోసం ఆక్స్‌ఫర్డ్ ప్లాంటులో నవంబర్ 8, 2013న గ్లోబల్ ప్రీమియర్ నిర్వహిస్తాకని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. కొత్తగా విడుదల కానున్న మినీ 4వ తరానికి (ఫోర్త్ జనరేషన్) చెందినది.
ప్రత్యేకించి నవంబర్ 18న కొత్త తరం మినీని ఆవిష్కరించడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. అదే రోజున సర్ అలెక్ ఇసిగోనిస్ 107వ జన్మదినం కావటమే ఈ ప్రత్యేకత. ఇంతకీ ఆయన ఎవరంటారా..? మినీ డిజైన్ వెనుక ఉన్న కీలక వ్యక్తి ఆయనే. 1959లో తొలిసారిగా మినీ కారును డిజైన్ చేసింది సర్ అలెక్ ఇసిగోనిస్.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మినీ ఆరంభం నుంచి నిరంతరాయంగా కార్లను ఉత్పత్తి చేస్తున్న ఆక్స్‌ఫర్డ్ ప్లాంటులో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని, అనంతరం లండన్‌లో ఓ ప్రత్యేక పార్టీని కూడా నిర్వహించనున్నారు. అంతేకాకుండా, తమ నెక్స్ట్ జనరేషన్ మినీ కారును నవంబర్ 20 నుంచి జరిగే టోక్యో మోటార్ షో, లాస్ ఏంజిల్స్ ఆటో షోలలో కూడా ప్రదర్శనకు ఉంచనున్నారు.
వచ్చే సంవత్సరం తొలిత్రైమాసికంలో (జనవరి-ఏప్రిల్ 2014)లో ఈ కొత్త తరం మినీ కారు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. అంటే, మనదేశంలో కూడా ఈ కొత్త తరం మినీ విడుదలయ్యే ఆస్కారం ఉంది. మినీ మాతృసంస్థ బిఎమ్‌డబ్ల్యూకి చెందిన యూకెఎల్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని 2014 మినీ కారును అభివృద్ధి చేశారు. ఈ ప్లాట్‌ఫామ్‌పై తయారైన తొలి కారు 2014 మినీ కావటం విశేషం.

ఇందులో ఉపయోగించిన ఛాస్సిస్ ఫ్రంట్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్‌కు సహకరిస్తుంది. మినీ కార్లలో బిఎమ్‌డబ్ల్యూ ఇంజన్లను కూడా ఉపయోగించనున్నారు. ఈ కొత్త తరం మినీ కారులో 1.5 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లను ఉపయోగించనున్నారు. 2014 మినీ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు సెప్టెంబర్ 18న వెల్లడి కానున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








