మిత్సుబిషి సెడియా, ల్యాన్సర్, అవుట్‌లాండర్ ఉత్పత్తి బంద్
జపనీస్ కార్ కంపెనీ మిత్సుబిషి భారత మార్కెట్లో అందిస్తున్న సెడియా, ల్యాన్సర్ ఎవల్యూషన్ ఎక్స్ సెడాన్లు మరియు అవుట్‌లాండర్ ఎస్‌యూవీలు ఇకపై కనుమరుగు కానున్నాయి. ఈ మూడు మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు మిత్సుబిషి ఇండియా తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.
సెడియా విషయంలో 'అల్టిమేట్ ర్యాలీ కార్ ఇప్పుడు రోడ్డు పైనుంచి వెళ్లిపోయింద'ని, ల్యాన్సర్ ఎవల్యూషన్ ఎక్స్ విషయంలో 'ఉత్పత్తి విశ్రాంతి తీసుకుంటుంద'ని కంపెనీ పేర్కొంది. గ్లోబల్ మార్కెట్లలో కూడా ఈ మోడల్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి మిత్సుబిషి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
సెడియా, ల్యాన్సర్ మరియు అవుట్‌లాండర్ మోడళ్లు ఇండియా నుంచి వెళ్లిపోవటంతో, ఇక ఇక్కడి మార్కెట్లో మిగిలినవి రెండే మోడళ్లు, ఆ రెండు కూడా ఎస్‌యూవీలే. ప్రస్తుతం మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ మరియు మిత్సుబిషి మోంటెరో ఎస్‌యూవీలను మాత్రమే దేశీయ విపణిలో లభ్యమవుతున్నాయి.
మిత్సుబిషి సెడాన్ల ఉత్పత్తి కన్నా ఎస్‌యూవీల ఉత్పత్తి పైనే ప్రధానంగా దృష్టి సారించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వీటి ఉత్పత్తిని నిలిపివేస్తూ కంపెనీ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు సెడియా, ల్యాన్సర్ సెడాన్లు కూడా పాతబడిపోయాయి. వీటిలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను రాలేదు. మరి వీటి స్థానంలో కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన మోడళ్లను ప్రవేశపెడుతుందా లేక పూర్తిగా నిలిపివేస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది.







Click it and Unblock the Notifications








