హైదరాబాద్‌లో మిత్సుబిషి కొత్త షోరూమ్ ప్రారంభం

By Ravi

ప్రముఖ జపనీస్ కార్ కంపెనీ మిత్సుబిషి హైదరాబాద్‌లో మరొక కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. మిత్సుబిషి తమ భారతీయ భాగస్వామి హిందుస్థాన్ మోటార్స్ సహకారంతో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో 3000 చ.అ. పైగా విస్తీర్ణంలో ఓ అధునాతన షోరూమ్‌ను కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ షోరూమ్‌కు సమీపంలోనే ఓ పెద్ద వాహన సర్వీసింగ్ కేంద్రాన్ని కూడా కంపెనీ ప్రారంభించింది. 12000 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సర్వీస్ సెంటర్‌లో మిత్సుబిషి రోజుకు 25 కార్లను సర్వీసింగ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ప్రస్తుతం మిత్సుబిషి దేశీయ విపణిలో సెడియా స్పోర్ట్స్, అవుట్‌లాండర్, పాజెరో స్పోర్ట్, మోంటెరో, లాన్సర్ ఎవల్యూషన్ ఎక్స్ కార్లను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.8.24 లక్షల నుంచి రూ.50.23 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కాగా హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన షోరూమ్‌లో పాజెరో స్పోర్ట్, మాంటెరో, అవుట్‌లాండర్‌లను కంపెనీ ప్రదర్శనకు ఉంచనుంది. మిత్సుబిషి హైదరాబాద్ కొత్త షోరూమ్, సర్వీస్ సెంటర్ల చిరునామాలు ఇలా ఉన్నాయి:

షోరూమ్:
1-10/4, 1-10/4A & 1-10/4B,
Madhapur, Hyderabad.
Andhra Pradesh

సర్వీస్ సెంటర్:
Jai Hind Enclave
Madhapur, Hyderabad.
Andhra Pradesh

Mitsubishi Hyderabad Showroom

More from DriveSpark

Article Published On: Thursday, February 28, 2013, 12:43 [IST]
English summary
Mitsubishi has opened its 42nd dealership in the country in Hyderabad. Spread over 3000 sq. ft the new Mitsubishi showroom is located in Madhapur, Hyderabad. Mitsubishi has also setup a 12000 sq. ft service workshop near to this showroom. This workshop has the capability to service 25 cars in a day.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+